Delhi: రేపు మరోసారి బీజేపీ సీఈసీ సమావేశం.. తెలంగాణలో మిగిలిన 8 స్థానాలపైనా కసరత్తు

BJP CEC Meeting Again Tomorrow In Delhi
x

Delhi: రేపు మరోసారి బీజేపీ సీఈసీ సమావేశం.. తెలంగాణలో మిగిలిన 8 స్థానాలపైనా కసరత్తు

Highlights

Delhi: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బీజేపీలో చేరితే.. ఆయనకే ఇస్తారని మరో ప్రచారం

Delhi: లోక్‌సభ అభ్యర్థుల రెండో జాబితాపై బీజేపీ కసరత్తు చేస్తోంది. రేపు ఢిల్లీలో మరోసారి బీజేపీ సీఈసీ సమావేశం నిర్వహిస్తోంది. ఇప్పటికే 7 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ తెలంగాణలో మిగిలిన 8 స్థానాలపైనా కసరత్తు పూర్తి చేసింది. అయితే.. ఈసారి పలు స్థానాలకు అభ్యర్థలను మార్చేందుకు బీజేపీ సమాలోచనలు జరుపుతోంది.

ఇప్పటివరకూ ప్రకటించని ఆస్థానాలకు ఒక్కో స్థానానికి ముగ్గురు లేదా ఇద్దరు చొప్పున అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ బాపురావు ఉన్నా ఫస్ట్‌లిస్ట్‌లో పేరు ప్రకటించలేదు. దీంతో అసలు లిస్టులో ఆయన పేరు ఉంటుందా.. లేదా అన్నది ఉత్కంఠగా మారింది. మరోవైపు ఇదే స్థానానికి రమేష్ రాథోడ్, సోలంకి శ్రీనివాస్ పేర్లను హైకమాండ్ పరిశీలిస్తుంది.

బీజేపీ బలంగా ఉన్న దక్షిణ తెలంగాణలో మహబూబ్‌నగర్ జిల్లానే ముఖ్యమైనది. అయితే.. మహాబూబ్‌నగర్ నుంచి డీకే అరుణ, జితేందర్‌రెడ్డి, శాంతికుమార్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇటు మెదక్‌ నుంచి రఘునందన్‌, గోదావరి అంజిరెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. రఘునందన్‌రావుతో పాటు అంజిరెడ్డి పేరు హైకమాండ్ పరిశీలిస్తుంది. ఖమ్మం నుంచి టికెట్ రేసులో ఈవీ రమేష్, వినోద్ రావు పోటీ పడుతున్నారు. పెద్దపల్లి నుంచి టికెట్ ఆశిస్తున్న ఎస్ కుమార్, ఆరేపల్లి మోహన్, గాయకుడు మిట్టపల్లి సురేందర్ పేర్లను అధిష్టానం పరిశీలిస్తుంది.

ఇక వరంగల్ నుంచి కడియం కల్యాణ్, కృష్ణ ప్రసాద్ పోటీ పడుతుండగా.. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే టికెట్ ఆయకే దక్కుతుందని ప్రచారం జరుగుతోంది. నల్గొండలో బీజేపీ నుంచి బడా లీడర్ లేపోవడంతో ఎవరికి టికెట్ ‎ఇస్తారని రాజకీయవర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే.. మనోహర్ రెడ్డితో పాటు గతంలో పోటీ చేసిన నర్సింహారెడ్డికే ఛాన్స్ వస్తుందని శ్రేణులు మాట్లాడుతుండగా.. ఇటీవల బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బీజేపీలో చేరతారని.. ఒకవేళ చేరితే.. మనోమర్ రెడ్డిని... నర్సింహారెడ్డిని పక్కనపెట్టి.. ఆయనకే ఇచ్ఛే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories