జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఊహించని విజయం కోసం బీజేపీ కసరత్తు

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఊహించని విజయం కోసం బీజేపీ కసరత్తు
x
Highlights

దుబ్బాక ఊపుతో తెలంగాణ బీజేపీలో మంచి జోష్ కనిపిస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ లో ఊహించని విజయం కోసం కసరత్తు చేస్తోంది. దుబ్బాక వ్యూహాన్ని బల్దియాలో అమలు...

దుబ్బాక ఊపుతో తెలంగాణ బీజేపీలో మంచి జోష్ కనిపిస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ లో ఊహించని విజయం కోసం కసరత్తు చేస్తోంది. దుబ్బాక వ్యూహాన్ని బల్దియాలో అమలు చేయడానికి ప్లాన్ వేస్తుంది.

దుబ్బాకలో వచ్చిన పొజిటీవ్ టాక్ ను గ్రేటర్ హైదరాబాద్ లో కొనసాగించాలని బీజేపీ తహతహలాడుతోంది. ఇదే అంశం పై శనివారం బీజేపీ పదాధికారుల సమేశంలో సీరియస్ గా చర్చింది. దుబ్బాకలో అన్ని పార్టీల కంటే ముందుగానే ప్రచారంలో దిగి అధికార పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపెట్టామని బీజేపీ భావిస్తుంది. గ్రేటర్ లోనూ ఎన్నికల నోటిఫికేషన్ తో సంబంధం లేకుండా పార్టీ ముఖ్య నేతలంతా ప్రచార బాట పట్టాలని పార్టీ నిర్ణయించినట్లు సమాచారం.

డబుల్ బెడ్ రూం పథకం పేరు చెప్పుకొని టీఆర్ఎస్ బల్దియా మేయర్ సీట్ దక్కించుకుందని, ప్రధానంగా పార్టీ నేతలు దానిపై దృష్టి సారించాలని బీజేపీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. గత గ్రేటర్ ఎన్నికల సందర్బంగా TRS ప్రజల వద్ద నుంచి లక్షల్లో దరఖాస్తులు తీసుకొని వేలల్లో కూడా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంజూరు చేయలేకపోయిందని, ప్రజలకు చెప్పేందుకు కాషాయ పార్టీ సిద్దం అయింది. వీటితో పాటు ముఖ్య నేతలంతా గ్రేటర్ లో పాదయాత్రలు చేసి నగరం చుట్టేయాలని ప్రతిపాదన వచ్చినట్లు తెలుస్తోంది. అయితే అధ్యక్షుడు బండి ఈ ప్రతిపాదనపై ఆలోచిద్దాం అన్నట్టు సమాచారం. దుబ్బాక ఎన్నిక ఫలితం ఇంకా తేలనేలేదు. అప్పుడే బీజేపీ తమకు అనుకూలంగా తీర్పు రాబోతుందని చెప్పి హాడావిడి చెయ్యాలని భావిస్తుంది. దుబ్బాక వ్యూహం GHMC లో ఏ విధంగా వర్కౌట్ అవుతుందో చూడాలి.


Show Full Article
Print Article
Next Story
More Stories