కళ్ళ ముందు కనిపించని నాయకులకు ఓట్లు అడిగే హక్కు లేదు : మంత్రి హరీష్ రావు

కళ్ళ ముందు కనిపించని నాయకులకు ఓట్లు అడిగే హక్కు లేదు : మంత్రి హరీష్ రావు
x
Highlights

విశ్వసనీయత కలిగిన పార్టీకి, ప్రభుత్వానికి మద్దతు తెలపడంలో యువత ముందుంటారని, అలాంటి వారు టీఆర్ఎస్ పార్టీలో చేరడం శుభపరిణామం ఆర్థిక మంత్రి హ‌రీష్ రావు...

విశ్వసనీయత కలిగిన పార్టీకి, ప్రభుత్వానికి మద్దతు తెలపడంలో యువత ముందుంటారని, అలాంటి వారు టీఆర్ఎస్ పార్టీలో చేరడం శుభపరిణామం ఆర్థిక మంత్రి హ‌రీష్ రావు అన్నారు. దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక నేప‌థ్యంలో ఆనాజ్‌పూర్‌, తిమ్మ‌క్క‌ప‌ల్లి గ్రామాల‌కు చెందిన కొంత మంది బీజేపీ పార్టీకి చెందిన యువ‌కులు హ‌రీష్ రావు స‌మ‌క్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి హ‌రీష్‌రావు ఆ యువ‌కులంద‌రికీ గులాబీ కండువాలు క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీష్ రావు మాట్లాడుతూ యువ‌కులే టీఆర్ఎస్ పార్టీ సైనికులు అని స్ప‌ష్టం చేశారు. యువతను ఆకర్షించేలా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మాయమాటలు చెబుతున్న విషయాన్ని గ్రహించి పని చేసే పార్టీ వైపు వచ్చిన వారందరికీ తగిన గుర్తింపు ఇస్తామన్నారు. జాబ్ మేళాలు నిర్వహించి ప్రయివేట్ ఉద్యోగాలను యువత కళ్ళ ముందుకు తీసుకొచ్చాం అని అన్నారు.

ప్రభుత్వ ఉద్యోగాలు రావడానికి సొంత ఖర్చులతో కోచింగ్ సెంటర్లు పెట్టి ఎంతో మంది కుటుంబాల్లో వెలుగులు నింపామని ఆయన అన్నారు. యువతకు ఉపాధి కల్పించడం కోసం ఈ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని హరీష్ రావు గారు వివరించారు. యువతకు ఏ అవసరం వచ్చినా ఈ ప్రాంతంలో నేను, రామలింగన్న అండగా నిలబడ్డామని గుర్తు చేశారు. కళ్ళ ముందు కనిపించని నాయకులకు దుబ్బాక నియోజకవర్గంలో ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. టీఆర్ఎస్ పార్టీ చెప్పే ప్రతి మాట వాస్తవాలే తప్ప కాంగ్రెస్, బీజేపీలు చెప్పే కళ్ళబొల్లి మాటలు కాదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక, రాయ్ పోల్ మండలం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories