మునుగోడుపై బీజేపీ యాక్షన్ ప్లాన్

BJP Action Plan on Munugode
x

మునుగోడుపై బీజేపీ యాక్షన్ ప్లాన్

Highlights

Munugode: ఈ నెల 21న మునుగోడులో బహిరంగ సభ

Munugode: రాజగోపాల్‌ రెడ్డి రాజీనామా తర్వాత ఉపఎన్నికలో అందరికంటే ముందువరుసలో ఉన్నామనుకున్న బీజేపీకి టీఆర్ఎస్‌ నుంచి అనూహ్య రీతిలో పోటీ ఎదురవుతోంది. మునుగోడును ఎలాగైనా చేజిక్కించుకునేందుకు పక్కా ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే బీజేపీ సభకు ఒకరోజు ముందే బహిరంగ సభ ద్వారా ప్రచారాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న సమయంలో కమలం శ్రేణులు కూడా అందుకు తగ్గట్లే రెడీ అవుతున్నారు. ఈ నెల 21 న మునుగోడు సభను పార్టీ హైకమాండ్‌ కన్ఫర్మ్ చేశారు. సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరుకానున్నారని. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మునుగోడు సభ వాయిదా పడిందంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఆ రోజున కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సహా మరికొందరు ప్రముఖులు కాషాయ తీర్థం పుచ్చుకుంటారని బండి సంజయ్ తెలిపారు.

అయితే కొత్తగా వచ్చే నాయకులతో సమన్వయం కోసం ఓ కమిటీ ఏర్పాటు చేయాలని బీజేపీ నిర్ణయించింది. నిన్న బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొన్న బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ తరుణ్ చుగ్. దీనిపైనే ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా 21 న సభతో పాటు 20 న టీఆర్ఎస్ తలపెట్టిన మీటింగ్‌పై ఆరా తీశారు. ఇటు వలసలపైనే ఫుల్ ఫోకస్ చేసిన బీజేపీ నాయకత్వం ఉపఎన్నికలను ఛాలెంజింగ్‌గా తీసుకుంది. ఇప్పటికే జిల్లాలో బండి సంజయ్ పాదయాత్ర సాగుతున్న క్రమంలో వీలైనంత ఎక్కువ మందిని పార్టీలోకి ఆహ్వానించేందుకు సకల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు 21 న సభ తర్వాత బీజేపీ నేతలంతా మునుగోడులోనే మకాం వేయాలని నిర్ణయించారు. ఇంటింటికీ వెళ్లి టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు అధికారంలోకొస్తే చేపట్టే కార్యక్రమాలపై అవగాహన కల్పించేందుకు యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories