ఓ పక్షి ప్రేమికుని అరుదైన ఆలోచన.. సలాం చేస్తున్న నెటిజన్లు

ఓ పక్షి ప్రేమికుని అరుదైన ఆలోచన.. సలాం చేస్తున్న నెటిజన్లు
x
Highlights

చాలా మంది ఇంట్లో పనికి రాని వస్తువులను బయట పడేయకుండా వాటితో ఏదో ఒక ప్రయోగం చేసి ఓ మంచి వస్తువును తయారు చేస్తుంటారు.

చాలా మంది ఇంట్లో పనికి రాని వస్తువులను బయట పడేయకుండా వాటితో ఏదో ఒక ప్రయోగం చేసి ఓ మంచి వస్తువును తయారు చేస్తుంటారు.ఇలాంటి ఐడియాతోనే ఒకరు పక్షులకు తినడానికి తిండి, తాగడానికి నీళ్లు ఒకేచోట ఉండేట్టు ఓ రేకు డబ్బాతో ఏర్పాటు చేసాడు. ప్రస్తుత ఆ ఫోటో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నప్పటికీ దాన్ని తయారు చేసిన పక్షి ప్రేమికుడు ఎవరు అన్నది మాత్రం తెలియదు.

ప్రస్తుతం ఉన్న వాతావరణంలో పక్షలు, పిచ్చుకలు, తిండి దొరకక, తాగడానికి నీళ్లు దొరకక అల్లాడిపోతుంటాయి. తిండి, నీళ్ల కోసం ఎండను లెక్క చేయకుండా ఎంతో దూరం ప్రయాణిస్తే తప్ప అవి బతికే పరిస్థితి కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితిలో పక్షల గోస చూసిన ఎవరో పక్షి ప్రేమికుడు వాటి కోసం నీరు, గింజలు పుష్కలంగా సమకూర్చేందుకు ఓ డబ్బాను తయారు చేసారు.

వాస్తవానికి ఒకప్పుడు వాతావరణంలో ఎన్నో పక్షలు, పిచ్చుకలు ఉదయం లేచిన సమయం నుంచి పొలాల్లో, ఇండ్ల చుట్టూ తిరుగుతూ సందడి చేసేవి. కానీ కాలం మారుతున్న కొలది పక్షి జాతులన్నీ అంతరించి పోతున్నాయి. ఇంకా కొన్ని రోజులు ఇలానే ఉంటే కొన్ని జాతుల పక్షలను, పిచ్చుకలను, జంతువులను టీవీలు, కంపూటర్లు, సెల్‌ఫోన్లలో మనపిల్లలకు చూపించాల్సిన దుస్థితి ఏర్పడుతుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories