తెలంగాణలో బర్డ్ ఫ్లూ కలకలం..? ఆ జిలాల్లో వేల సంఖ్యలో కోళ్లు మృతి

తెలంగాణలో బర్డ్ ఫ్లూ కలకలం..? ఆ జిలాల్లో వేల సంఖ్యలో కోళ్లు మృతి
x

బర్డ్‌ ఫ్లూ.. కోళ్ల మృతి ఫైల్ ఫోటో 

Highlights

కరీంనగర్‌, వికారాబాద్‌ జిల్లాల్లో వేల సంఖ్యలో కోళ్లు మృతి భయాందోళనకు గురవుతున్న ప్రజలు బర్డ్ ఫ్లూ కాదంటున్న పశు వైద్యాధికారులు

బర్డ్‌ ఫ్లూ ఆ..? లేక మరేదైనా వింత వ్యాధా..? అసలు కోళ్ల మృతికి కారణమేంటి..? ఏ వైరస్‌ వల్ల వేల సంఖ్యల్లో కోళ్లు చనిపోతున్నాయి..? ప్రస్తుతం తెలంగాణ ప్రజల మెదడులో మెదులుతున్న ప్రశ్న ఇది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కాకులు, కోళ్ల మృతి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది.

కరీంనగర్‌ జిల్లాలో వింత వ్యాధి ప్రజలను కలవరపెడుతోంది. చిగురుమామిడి మండలం నవాబ్‌పేటలో భారీగా నాటుకోళ్లు మృత్యువాత పడ్డాయి. దీంతో కళేబరాలను గ్రామశివారులో పూడ్చి పెట్టాడు యజమాని. కోళ్ల మృతితో లక్షల్లో ఆస్తినష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం ఇప్పటికైనా కోళ్ల మృతికి గల కారణాలను అన్వేషించాలని కోరాడు. అయితే.. విషయం తెలుసుకున్న గ్రామస్తులు.. బర్డ్‌ ఫ్లూ అంటూ భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు చనిపోయిన కోళ్లను పరిశీలించిన పశు వైద్యాధికారులు.. బర్డ్‌ ఫ్లూ కాదని చెబుతున్నారు.

వికారాబాద్‌ జిల్లాలోనూ ఇదే ఘటన వెలుగుచూసింది. దారూర్‌ మండలం దోర్నాల్‌లో గత 4 రోజులుగా వందల సంఖ్యలో కోళ్లు, కాకులు మృత్యువాత పడ్డాయి. దీంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. కోళ్లు, కాకుల మృతిపై పశుసంవర్ధకశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.



Show Full Article
Print Article
Next Story
More Stories