Water Supply: హైదరాబాద్ నగర వాసులకు బిగ్ అలర్ట్..24గంటల పాటు మంచినీటి సరఫరా బంద్

Water Supply: హైదరాబాద్ నగర వాసులకు బిగ్ అలర్ట్..24గంటల పాటు మంచినీటి సరఫరా బంద్
x
Highlights

Hyderabad Water Supply: హైదరాబాద్ నగరంలో మంచినీటి సరఫరాకు కొంత కాలం బ్రేక్ పడనుంది.

Hyderabad Water Supply: హైదరాబాద్ నగరంలో మంచినీటి సరఫరాకు కొంత కాలం బ్రేక్ పడనుంది. గ్రేటర్ హైదరాబాద్ కు తాగునీరు అందించే మంజీరా ఫేజ్ 2 పైపుల్లో భారీ లీకేజీలు ఏర్పడిన కారణంగా జలమండలి అధికారులు సకాలంలో స్పందించారు. కలబ్ గూర్ నుంచి పటాన్ చెరు వరకు ఉన్న 1500 ఎంఎం డయా పీఎస్సీ పైపుల్లో ఏర్పడిన లీకేజీల వల్ల ఈ ప్రాంతంలో నీరు వృథాగా పోతుంది.

ఈ లీకేజీలను నియంత్రించేందుకు జలమండలి ఈనెల 11వ తేదీ సోమవారం ఉదయం 6గంటల నుంచి 12వ తేదీ మంగళవారం ఉదయం 6గంటల వరకు మరమ్మత్తు పనులు చేపడుతుంది. దాంతో 24గంటల పాటు ఈ పైపుల పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోడం లేదా తక్కువ నీరు వస్తుందని అధికారులు తెలిపారు.

ఓ అండ్ ఎం డివిజన్ 15 ఆర్సీపురం, అశోక్ నగర్, జ్యోతినగర్, లింగంపల్లి, చందానగర్, గంగారం, మియాపూర్ మదీనాగూడ,బీరంగూడ, అమీన్ పూ్ర, ఎర్రగడ్డ, ఎస్ ఆర్ నగర్, అమీర్ పేట్, కేపీ హెచ్ బీ కాలనీ, కూకట్ పల్లి, మూసాపేట, జగద్గిరిగుట్ట, ఈ ప్రాంతాల ప్రజలు ముందుగానే నీటిని నిల్వ చేసుకోవాలని జలమండలి అధికారులు విజ్నప్తి చేశారు.

మరమ్మతులు పూర్తయ్యే వరకు నీటి సరఫరాకు ఇబ్బంది కలుగుతుందని తెలిపారు. ఇది అనివార్యమని వివరించారు. నగర వాసులు ఈ సమస్యను అర్థం చేసుకుని జలమండలి అధికారులకు సహకరించాలని సూచించారు.

ఈ లీకేజీలను తొందరగా పరిష్కరించుకునేందుకు జలమండలి శక్తివంచన లేకుండా పనిచేస్తోంది మంజీరా ఫేజ్ 2 పైపుల మరమ్మత్తులు పూర్తయ్యాక, స్థానిక ప్రజలకు నాణ్యమైన నీరు అందించేలా చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories