పోలీసుల అదుపులో భార్గవరామ్?

పోలీసుల అదుపులో భార్గవరామ్?
x
Highlights

బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. కిడ్నాప్‌ జరిగిన రోజు నుంచి తప్పించుకుని తిరుగుతోన్న అఖిలప్రియ భర్త భార్గవరామ్‌ను...

బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. కిడ్నాప్‌ జరిగిన రోజు నుంచి తప్పించుకుని తిరుగుతోన్న అఖిలప్రియ భర్త భార్గవరామ్‌ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. పక్కా సమాచారంతో పుణెలో భార్గవరామ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. భార్గవరామ్‌తోపాటు 11మంది కిడ్నాపర్లను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, పోలీసుల రాకను ముందే గుర్తించిన మరో కీలక నిందితుడు గుంటూరు శ్రీను తృటిలో తప్పించుకున్నట్లు చెబుతున్నారు. బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో అఖిలప్రియ ఏ1గా ఉండగా ఆమె భర్త భార్గవరామ్‌ ఏ3గా ఉన్నాడు. కిడ్నాప్ ప్లాన్ వెనుక మాస్టర్ మైండ్ అఖిలప్రియ కాగా దాన్ని ఎగ్జిక్యూట్ చేసింది మాత్రం భార్గవరామ్‌గా పోలీసులు అనుమానిస్తున్నారు.

బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో రోజుకో సంచలనం బయటికొస్తోంది. కిడ్నాప్‌కు ముందు హాఫీజ్‌పేట భూములపై బెంగళూరులో సెటిల్‌మెంట్‌కు చర్చలు జరిగినట్లు సమాచారం అందుతోంది. ప్రవీణ్‌రావు, భార్గవరామ్ మధ్య బెంగళూరులో పంచాయతీ జరిగిందని, ఇద్దరి మధ్య సెటిల్‌మెంట్‌కు ఇద్దరు తెలంగాణ ప్రముఖులు మధ్యవర్తిత్వం వహించినట్లు తెలుస్తోంది. అఖిలప్రియ సమక్షంలోనే ఈ సెటిల్‌మెంట్‌కు చర్చలు జరిగాయని అంటున్నారు. అయితే, ఇరువర్గాల మధ్య సెటిల్‌మెంట్‌ కుదరకపోవడంతోనే ప్రవీణ్‌రావు అండ్ బ్రదర్స్‌ను కిడ్నాప్‌చేసి డ్యాక్యుమెంట్స్‌పై సంతకాలు చేయించుకున్నట్లు తెలుస్తోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories