Bhadradri Kothagudem: రెచ్చిపోయిన ప్రేమోన్మాది..యువతి పై దాడి

Bhadradri Kothagudem: రెచ్చిపోయిన ప్రేమోన్మాది..యువతి పై దాడి
x

representational image

Highlights

* ప్రేమించలేదని యువతిపై కత్తితో దాడి చేసిన యువకుడు. * దాడి చేసి యువతిని ముళ్ల పొదల్లోకి తోసేసిన యువకుడు * చేతులకు అంటిన రక్తంతో పెట్రోలింగ్‌ పోలీసులకు కనిపించిన యువకుడు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రేమించలేదని కోపంతో యువతిపై కత్తితో దాడి చేశాడో ఉన్మాది. యువతిపై దాడి చేసి యువతిని ముళ్ల పొదల్లోకి తోసేసాడు. అనంతరం రోడ్డుపై నడుస్తున్న సమయంలో.. పెట్రోలింగ్‌ పోలీసులకు కనిపించాడు. వాళ్లు ప్రశ్నించడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. ఈ ఘటన ఇల్లందు మండలం సత్యానారాయణపురంలో చోటు చేసుకుంది.


ఇల్లందుపాడుకి చెందిన యువతిని.. అదే గ్రామానికి చెందిన జక్కుల సందీప్ కొంత కాలంగా ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నాడు. అయితే.. సందీప్‌ను మందలించిన తీరు మార్చుకోలేదు. దాంతో అసహానానికి గురైన.. సందీప్.. ఆమెను అంతం చేయాలనుకున్నాడు. అర్ధరాత్రి సమయంలో యువతిపై సందీప్‌ కత్తితో దాడి చేసి.. ముళ్ల పొదల్లోకి నెట్టేశాడు. అపస్మారక స్థితిలో ఉన్నయువతిని, ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించిన పోలీసులు

Show Full Article
Print Article
Next Story
More Stories