Telangana: తెలంగాణలో భారీగా పెరిగిన బీర్ల విక్రయం

Beer Sales Increased in Telangana
x

Telangana: తెలంగాణలో భారీగా పెరిగిన బీర్ల విక్రయం

Highlights

Telangana: తెలంగాణలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఎండ తాపానికి తట్టుకునేందుకు మనం వివిద మార్గాలను ఎంచుకుంటూ ఉంటాం.

Telangana: తెలంగాణలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఎండ తాపానికి తట్టుకునేందుకు మనం వివిద మార్గాలను ఎంచుకుంటూ ఉంటాం. కాని హైదరాబాద్ నగరంలో మందు బాబులు మాత్రం వాళ్ల స్టైల్లో సేద తీరుతున్నారు. ఎండ వేడిమి తట్టుకునేందుకు బీర్లు కొనుక్కుని తాగేస్తున్నారు.

ఓ వైపు కరోనా విస్తరిస్తున్నా బీర్ల అమ్మకాల జోరు ఏ మాత్రం తగ్గకపోగా మరింత పెరుగుతోంది. గత ఏడాదిని మించి అమ్మకాలు జరుగుతున్నాయి. గత ఏడాది మార్చిలో 26.35 లక్షల కేసుల బీర్లు అమ్మకాలు జరిగితే ఈ ఏడాది మార్చి నెలలో ఏకంగా 29.59 లక్షల కేసుల బీర్లు అమ్మకాలు జరిగాయి. సాదారణంగా ఎండాకాలంలో బీర్ల అమ్మకం ఎక్కువగా ఉంటుంది. కాని ఈ సారి ఇంకా పూర్తిగా ఎండలు మొదలుకాక ముందే బీర్ల అమ్మకాలు విపరీతంగా పెరిగాయి.

జనవరిలో అత్యధికంగా మద్యం అమ్ముడు పోయినప్పటికీ ఫిబ్రవరిలో మాత్రం కొంత తగ్గింది. మళ్లీ మార్చి నెలలో పుంజుకుంది. ఈ ఏడాది జనవరిలో 2727.15 కోట్లు, ఫిబ్రవరిలో 2,331.65 కోట్లు, మార్చి నెలలో 2,473.89 కోట్లు కలిపి మొత్తంగా 7,532.69 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయని ఎక్సైజ్‌ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

ఇక రాష‌్ట్ర వ్యాప్తంగా 2020–21లో మొత్తం 27,288.72 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయని ఎక్సైజ్‌ గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో 3.3 కోట్ల ఐఎంఎల్‌ కేసులు, 2.7 కోట్ల బీర్‌ కేసులు అమ్ముడుపోయాయి. అంటే రోజుకు సగటున 90 వేలకు పైగా ఐఎంఎల్, 74 వేలకు పైగా బీర్ కేసులను రాష్ట్రంలోని మందుబాబులు తాగేశారు. ఇలా రాష్ట్రంలో ఈ ఏడాది సగటున రోజుకు దాదాపు 75 కోట్ల విలువైన మందు అమ్ముడుపోయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories