Telangana: తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు మరో పదేళ్లు పొడిగింపు

BC Quota in Education Employment for 10 More Years in Telangana
x

తెలంగాణ ప్రభుత్వం (ఫోటో ది హన్స్ ఇండియా)

Highlights

Telangana: బీసీ రిజర్వేషన్లను పదేళ్లపాటు పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది.

Telangana: తెలంగాణ లో రాజకీయ పరిణామాలు వేగంగా మార్పు చెందుతున్నాయి. ఒక వైపు బిజెపి, మరో వైపు మాజీ మంత్రి ఈటల వంటి వారు బీసీ సమీకరణాలను చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. బీసీలకు

ఆంధ్రప్రదేశ్‌ ఉమ్మడి రాష్ట్రంలో తొలిసారిగా కేఎన్‌ అనంతరామన్‌ కమిషన్‌ సిఫార్సులను అనుసరించి 1970 సెప్టెంబరులో బీసీలకు విద్యా, ఉద్యోగ నియామాకాల్లో పదేళ్లపాటు రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆ తర్వాత దాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. తాజాగా రిజర్వేషన్ల గడువు మే నెల 31తో ముగుస్తున్నందున బీసీ కమిషన్‌ కార్యదర్శి సిఫార్సుల మేరకు ప్రభుత్వం మరోసారి పొడిగింపు ఉత్తర్వులను ఇచ్చింది.

తెలంగాణలోని వెనకబడిన తరగతులకు విద్యా ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లను మరో పదేళ్లపాటు పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. బీసీల పురోగతి, సమగ్రాభివృద్ధి కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. జూన్‌ ఒకటో తేదీ నుంచి 2031 మే నెల 31వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. దీంతోపాటు రాబోయే పదేళ్ల కాలంలో జరిగే ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో అయిదేళ్ల వయో పరిమితి పెంపును కొనసాగించేందుకూ ఆదేశించింది. అందుకు అనుగుణంగా అన్ని సాధారణ, సేవా, ప్రత్యేక నిబంధనలను ప్రభుత్వ శాఖలు సడలించాలని ఆదేశాలిచ్చింది. అన్ని శాఖలు ఈ ఉత్తర్వులను ఖచ్చితంగా అమలు చేయాలని సూచించింది. ప్రస్తుతం బీసీలకు తెలంగాణలో 29 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories