బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల నుంచి వసూళ్లు

Basara Triple IT College | TS News
x

బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల నుంచి వసూళ్లు

Highlights

Basara IIIT: ఆరోగ్య బీమా పేరుతో విద్యార్థుల నుంచి దోపిడీ

Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీని ఎప్పుడూ ఎదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంది. తాజాగా ఆరోగ్య బీమ పేరుతో విద్యార్థుల నుంచి దోపిడీకి తెరలేపినట్లు తెలుస్తోంది. ఇటీవల క్యాంపస్​లో పీయూసీ-2 చదువుతూ అనారోగ్యంతో మరణించిన విద్యార్థి.. ఆరోగ్య బీమా సొమ్ము చెల్లించినప్పటికీ ఇన్సూరెన్స్ అమలు కాలేదు. దీనిపై తల్లిదండ్రుల కమిటీ అధికారులకు ఫిర్యాదు చేయగా.. బీమా సొమ్ము ప్రీమియం చెల్లించలేదని వారి విచారణలో వెలుగులోకి వచ్చింది.

ప్రతి ఏడాది ప్రవేశాల సమయంలో ఒక్కో విద్యార్థి నుంచి 700 రూపాయలు అధికారులు వసూలు చేస్తున్నారు. గతేడాది 1500 మంది విద్యార్థుల నుంచి సుమారు 10 లక్షల రూపాయలు వసూలు చేశారు. అయితే పీయూసీ-2 చదువుతున్న విద్యార్థి మృతితో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. స్టూడెంట్ చెల్లించిన బీమా డబ్బులు ఇవ్వాలని తల్లిదండ్రుల కమిటీ అధ్యక్షురాలు రాజేశ్వరి డిమాండ్ చేశారు. అయితే గతేడాది బీమా డబ్బులు ఏ సంస్థకు చెల్లించలేదని ఇంచార్జ్ వీసీ వెంకటరమణ తెలిపారు. బీమా డబ్బులు విద్యాలయంలోనే ఉన్నాయంటూ సమాధానమిచ్చారు. దీనిపై విచారణ జరుపుతామని ఇంచార్జ్ వీసీ వెంకటరమణ తెలిపారు. మరోవైపు 2018 నుంచి ఆరోగ్య బీమా చెల్లింపుల్లో తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories