బీజేపీతోనే పాతబస్తీ అభివృద్ధి సాధ్యం : బండి సంజయ్

బీజేపీతోనే పాతబస్తీ అభివృద్ధి సాధ్యం : బండి సంజయ్
x
Highlights

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు బండి సంజయ్‌. ఎంఐఎం పార్టీని సీఎం కేసీఆర్‌ పెంచి పోషిస్తున్నారని.. పాతబస్తీకి మెట్రో ఎందుకు రాలేదో సీఎం కేసీఆర్‌ చెప్పాలని ప్రశ్నించారు.

పాతబస్తీ బీజేపీ అడ్డా అని.. బీజేపీతోనే పాతబస్తీ అభివృద్ధి సాధ్యమని అన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌. ఉదయం ఎమ్మెల్యే రాజాసింగ్‌, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలుపొందిన బీజేపీ కార్పొరేటర్లతో కలిసి ఆయన.. భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం మొక్కులు చెల్లించి.. 48 మంది కార్పొరేటర్లతో ఆలయంలో ప్రతిజ్ఞ చేయించారు. అమ్మవారి దయతోనే గ్రేటర్‌లో విజయం సాధించామని అన్నారు బండి సంజయ్‌.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు బండి సంజయ్‌. ఎంఐఎం పార్టీని సీఎం కేసీఆర్‌ పెంచి పోషిస్తున్నారని.. పాతబస్తీకి మెట్రో ఎందుకు రాలేదో సీఎం కేసీఆర్‌ చెప్పాలని ప్రశ్నించారు. హడావిడిగా జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించిన ప్రభుత్వం.. ఇప్పుడు మేయర్‌ ఎంపికలో ఎందుకు జాప్యం చేస్తుందో చెప్పాలన్నారు.

బీజేపీ ఏ వర్గానికి వ్యతిరేకం కాదని.. హిందూ ధర్మాన్ని కించపరిస్తే ఊరుకునేదిలేదని తేల్చిచెప్పారు. హిందూ దేవాలయాల స్థలాల జోలికి వెళ్తే సహించబోమన్న బండి సంజయ్.. కేసీఆర్‌ హిందువో.. బొందువో.. నిరూపించుకోవాలని సవాల్‌ విసిరారు. భాగ్యలక్ష్మి ఆలయం భాగ్యనగరంలోనే ఉందని.. భాగ్యలక్ష్మి అమ్మవారి పేరుమీదుగా.. హైదరాబాద్‌కు భాగ్యనగరం అనే పేరు వచ్చిందని గుర్తు చేశారు బండి సంజయ్. గ్రేటర్‌ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న ఆయన.. 48 మంది కార్పొరేటర్లు ప్రజల కోసం అన్నివేళలా కష్టపడి పనిచేస్తారని అన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories