సర్వేలన్నీ మాకే అనుకూలం: బండి సంజయ్

సర్వేలన్నీ మాకే అనుకూలం: బండి సంజయ్
x
Highlights

జీహెచ్ఎంసీలో రాజకీయం వేడెక్కింది. బల్దియా ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వరద సాయం నిలిపివేయాలంటూ ఈసీకి బీజేపీ లేఖ...

జీహెచ్ఎంసీలో రాజకీయం వేడెక్కింది. బల్దియా ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వరద సాయం నిలిపివేయాలంటూ ఈసీకి బీజేపీ లేఖ రాసిందని టీఆర్ఎస్‌ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. బీజేపీ లేఖ రాసిందని కేసీఆర్‌ చేసిన ఆరోపణలు బాధాకరమన్నారు. ఫోర్జరీ లేఖతో తనపై దుష్ప్రచారం చేశారన్నారు. తప్పుడు ప్రచారంతో గ్రేటర్‌లో గెలవాలని కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. ఫోర్జరీ లేఖపై వెంటనే స్పందించానన్న బండి సంజయ్‌ తన సవాల్‌కు కేసీఆర్ ఇప్పటికీ స్పందించలేదన్నారు. విశ్వనగరాన్ని విషాద నగరంగా మార్చారని ఎంఐఎంతో కేసీఆర్‌ కుమ్మక్కయ్యారంటూ ఆరోపించారు.

తమను దొంగదెబ్బ తీయడానికి సీఎం కేసీఆర్‌ ఆడిన నాటకంలో భాగమే ఈసీకి లేఖ అని ఆయన ఎదురుదాడికి దిగారు. తన పేరు మీద సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న లేఖ తాను రాయలేదన్నారు. నకిలీ లేఖపై నిజాలు తేల్చుకుందామంటూ సీఎం కేసీఆర్‌కు సంజయ్‌ సవాలు విసిరారు. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆల‌యం వ‌ద్దకు రావాలంటూ సవాల్‌ చేశారు. సర్వేలన్నీ బీజేపీకే రావడంతో కేసీఆర్‌కు భయం పట్టుకుందని అందుకే రాలేదని బండి సంజయ్ విమర్శించారు. తాను ఎన్నిసార్లు సవాల్ చేసిన సీఎం మాత్రం రావడం లేదని ఎద్దేవా చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories