Bandaru Dattatreya: దత్తన్న కూతురు రంగంలోకి దిగడం ఖాయమేనా?

Bandaru Dattatreya Daughter Vijaya Laxmi Coming into Politics
x

Bandaru Dattatreya: దతన్న కూతురు రంగంలోకి దిగడం ఖాయమేనా?

Highlights

Bandaru Dattatreya: దత్తన్న వారసురాలు రాజకీయాల్లోకి వస్తున్నారా?

Bandaru Dattatreya: దత్తన్న వారసురాలు రాజకీయాల్లోకి వస్తున్నారా? అలయ్ బలయ్ వేదికగా యాక్టివ్‌ కాబోతున్నారా? తన కూతురుని క్రియాశీల రాజకీయాల్లోకి తీసుకురావాలని దత్తన్న ఎందుకు అనుకుంటున్నారు? తండ్రి హరియాణాలో రాజ్‌భవన్‌కే పరిమితమవడంతో అన్నీ తానై తానొక్కరే పరిస్థితిని చక్కదిద్దుతున్నారా? అలయ్‌బలయ్‌ కార్యక్రమానికి దత్తన్న గానీ, ఆయన కమిటీ సభ్యులు కానీ పంపే ఇన్విటేషన్‌ని తానే అందరికీ స్వయంగా వెళ్లి ఎందుకు అందిస్తున్నారు? అంటే రాబోయే రోజుల్లో రాజకీయ ప్రవేశం ఖాయం చేసుకోబోతున్నారా? దత్తన్న బిడ్డ దూకుడుపై బీజేపీ ఏమంటోంది?

బీజేపీ సీనియర్‌ నాయకుడు, హరియాణా గవర్నర్ బండారు దత్తత్రేయ తన కూతురు విజయలక్ష్మికి రాజకీయ వారసత్వం కట్టబెట్టబోతున్నారట. బీజేపీలో కనిపించని వారసత్వ రాజకీయాలకు దత్తన్నే అంకురార్పణ చేయబోతున్నారన్న చర్చ జరుగతోంది. దత్తాత్రేయ క్రియాశీల రాజకీయాలకు దాదాపు దూరం అవడంతో పాటు రాజ్యాంగ హోదా గల పదవిలో హరియాణ గవర్నర్‌‌గా కొనసాగుతుండటంతో ఆయన కూతురు తెలంగాణలో రాజకీయాన్ని నెరిపేందుకు రెడీ అవుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. తనకు మీరుతున్న వయసుతో పాటు రాజ్యాంగబద్ధమైన పదవిలో కొనసాగుతుండటం, దాదాపుగా క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేకపోవడంతో తన వారసురాలుగా తన కుమార్తెతో పొలిటికల్‌ ఎంట్రీ ఇప్పించాలన్న ఆలోచనతో ఉన్నారట. మోడీ ప్రభుత్వంలో కేంద్రమంత్రి పనిచేసిన దత్తన్న మధ్యలోనే ఆ పదవికి రాజీనామా చేశారు. రెండోసారి పోటీ చేయకుండా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

ఆ తర్వాత హిమాచల్‌ప్రదేశ్‌‌కు గవర్నర్‌గా, హరియాణాకు ప్రథమ పౌరుడిగా వెళ్లారు దత్తన్న. మొదటి నుంచి కూడా దసరా వచ్చిందంటే దత్తన్న హడావిడే ఎక్కువ కనిపించేది. ప్రతి సంవత్సరం దసరా పండగ తరువాత నిర్వహించే అలయ్ బలయ్‌కి దత్తన్నే ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవారు. అయితే, ఈసారి అది మరింత ప్రత్యేకంగా ఉండబోతుందన్న ప్రచారం జరుగుతోంది. తన ఏకైక కుమార్తె విజయలక్ష్మిని, రాజకీయ వారసురాలుగా పరిచయం చేసేందుకు ఈ వేదికను ఎంచుకోబోతున్నారన్న టాక్‌ నడుస్తోంది. అలయ్‌బలయ్ సన్నహాక కార్యక్రామాల్లో విజయలక్ష్మే అత్యంత కీలకంగా వ్యవహరించడం ఇటు పార్టీలో, అటు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

మాములుగానైతే దత్తన్న హయాంలో అలయ్‌బలయ్‌ కార్యక్రమానికి రావాలని కమిటీ సభ్యుల ద్వారా ప్రముఖులకి ఆహ్వానం అందేది. కానీ ఈసారి విజయలక్ష్మే అన్నీ తానై ఎవరి సహకారం లేకుండా ముఖ్య నేతలను స్వయంగా కలిసి అలయ్‌బలయ్‌ ఆహ్వానపత్రికలను అందిస్తున్నారు. ఇదే ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారుతోంది. తండ్రి రాజ్‌భవన్‌లో ఉంటే, తానిక్కడ రాజకీయాలు చేస్తానంటూ విజయలక్ష్మి దూకుడుగా వ్యవహరిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే శాసనసభ స్వీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్, జనసేన అధ్యక్షుడు పవన్‌‌కల్యాణ్‌, మాజీ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలను కలసిన విజయలక్ష్మీ ఆహ్వానపత్రికలను అందజేశారు. దత్తన్న రాజకీయ వారసురాలిగా విజయమ్మ రంగంలోకి దిగడం ఖాయమన్న వార్తలకు ఇది మరింత ఊతమిస్తోందని అంటున్నారు విశ్లేషకులు.

ఈనెల 17వ తేదీ ఆదివారం అలయ్ బలయ్ కార్యక్రమంలో విజయలక్ష్మే తన రాజకీయ వారసురాలని అధికారికంగా ప్రకటించకున్నా తన కూతురు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తుందనే సంకేతం ఈ వేదిక ద్వారా దత్తన్న స్పష్టం చేసే అవకాశం ఉందన్న టాక్‌ నడుస్తోంది. ఇప్పటికే విజయలక్ష్మి బీజేపీలో క్రియాశీకంగా పనిచేయడానికి, తనకో పదవి ఉంటే బాగుంటుందని అధిష్టానం పెద్దల చెవిలో వేసినట్టు సమాచారం. ఏమైనా వచ్చే ఎన్నికల నాటికి దత్తన్న వారుసురాలిగా విజయలక్ష్మి బరిలో దిగడం ఖాయమైందన్న ప్రచారం పార్టీలో జోరుగా సాగుతోంది. మరి, విజయలక్ష్మీకి పార్టీ లైన్‌క్లియర్‌చేస్తుందా లేక అడ్డంకులు సృష్టిస్తుందా చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories