Balapur Ganesh: బాలాపూర్‌ లడ్డూకు రికార్డు ధర.. ఎంతంటే?

Balapur Ganesh Laddu Auctioned for Rs 30 Lakh
x

Balapur Ganesh: బాలాపూర్‌ లడ్డూకు రికార్డు ధర.. ఎంతంటే?

Highlights

Balapur Laddu Auction 2024: అందరూ ఊహించిన విధంగానే బాలాపూర్‌ లడ్డూ రికార్డు ధర పలికింది. 30 లక్షల వెయ్యి రూపాయలకు బాలాపూర్‌ లడ్డూను దక్కించుకున్నారు కొలను శంకర్‌రెడ్డి.

Balapur Laddu Auction 2024: అందరూ ఊహించిన విధంగానే బాలాపూర్‌ లడ్డూ రికార్డు ధర పలికింది. 30 లక్షల వెయ్యి రూపాయలకు బాలాపూర్‌ లడ్డూను దక్కించుకున్నారు కొలను శంకర్‌రెడ్డి. గతేడాది కంటే ఈసారి 3 లక్షల రూపాయలు ఎక్కువ పలికింది బాలాపూర్‌ లడ్డూ.

గణేష్‌ ఉత్సవాలకు హైదరాబాద్‌ కేరాఫ్‌ అడ్రస్‌ అందులోనూ ఖైరతాబాద్‌ బడా వినాయకుడు అంటే ఎంతో ఫేమస్ ఆ తర్వాత అందరికీ గుర్తుకువచ్చేది లడ్డూ వేలంపాట గణేష్‌ వేడుకల్లో లడ్డూ గురించి చెప్పగానే ముందుగా గుర్తుకువచ్చేది బాలాపూర్‌ గణేష్‌ లడ్డూయే ఖైరతాబాద్‌ గణేష్‌ ఎంత ఫేమసో.. బాలాపూర్‌ లడ్డూ ప్రసాదానికి అంతే క్రేజ్ అందుకే ఆ లడ్డూ కోసం అంతగా పోటీ పడుతుంటారు భక్తులు. ప్రతి ఏటా లక్షల్లో ధర పలుకుతూ కొత్త రికార్డులు సృష్టిస్తోంది బాలాపూర్‌ లడ్డూ.

నవరాత్రులు పూజలందుకున్న గణపయ్య లడ్డూ ప్రసాదాన్ని తింటే శుభం కలుగుతుందని, ఆరోగ్యంతో పాటు అష్ట ఐశ్యర్యాలు సిద్ధిస్థాయని భక్తుల విశ్వాసం. అందుకే పోటీ పడి మరీ బాలాపూర్‌ లడ్డూ వేలంలో పాల్గొని భక్తులు లడ్డూను దక్కించుకుంటారు. రూపాయి ఎక్కువైనా పర్వాలేదు లడ్డూ మాత్రం మనకే దక్కాలనేంతగా రంగంలోకి దిగుతుంటారు. అలా లడ్డూ వేలంలో ప్రత్యేకతను చాటుకుంటూ వస్తోంది బాలాపూర్ లడ్డూ. 30ఏళ్ల క్రితం వందల రూపాయలతో మొదలైన లడ్డూ వేలం ఇప్పుడు ఏకంగా లక్షల్లోకి చేరింది. పొలిటీషియన్లు, బిజినెస్‌ మెన్లు సైతం వేలం బరిలో నిలిచి గణేషుడి లడ్డూను సొంతం చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.

ఎప్పటిలాగే ఈసారి కూడా బాలాపూర్‌ లడ్డూ రికార్డు స్థాయిలో అమ్ముడుపోయింది. 30 లక్షల వెయ్యి రూపాయలకు బాలాపూర్‌ లడ్డూను దక్కించుకున్నారు కొలను శంకర్‌రెడ్డి. గతేడాది కంటే ఈసారి 3 లక్షల రూపాయలు ఎక్కువ పలికింది బాలాపూర్‌ లడ్డూ. బాలాపూర్‌కు చెందిన కొలను శంకర్‌రెడ్డి.. 30 లక్షల వెయ్యి రూపాయలకు వేలంలో బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నారు. వేలం స్టార్ట్ అయినప్పటి నుంచే నువ్వా నేనా అనేంతగా ఆశావహులు ఉత్సాహంగా పోటీపడ్డారు. చివరికి 30 లక్షల వెయ్యి రూపాయలకు కొలను శంకర్‌రెడ్డి బాలాపూర్ గణపయ్య లడ్డూ ప్రసాదాన్ని సొంతం చేసుకున్నారు.

గత ఏడాది బాలాపూర్ లడ్డూ 27లక్షలకు అమ్ముడుపోగా.. ఈసారి 3లక్షల వెయ్యి రూపాయలు ఎక్కువ పలికింది. ఏటికి ఏడు అత్యధిక ధర పలుకుతూ.. కొత్త రికార్డులను నమోదు చేస్తోంది బాలాపూర్ లడ్డూ. 1994లో బాలాపూర్ లడ్డూ వేలం స్టార్ట్ అయింది. అప్పుడు కేవలం 450 రూపాయలకు.. కొలను మోహన్ రెడ్డి దక్కించుకున్నారు. 2002లో తొలిసారి లక్ష రూపాయలు దాటింది. 2015లో 10లక్షలు దాటింది. 2021లో 18లక్షలు పలికిన లడ్డూ.. కేవలం మూడేళ్ల వ్యవధిలోనే 30లక్షలకు చేరింది. ఇలా ప్రతి యేటా తన ప్రత్యేకతను చాటుకుంటూ రికార్డు స్థాయికి చేరింది బాలాపూర్ గణేష్ లడ్డూ.

Show Full Article
Print Article
Next Story
More Stories