బడిబాట కార్యక్రమాన్ని వెక్కిరిస్తున్న ప్రభుత్వ పాఠశాలలోని సౌకర్యాల కొరత

Badi Bata Program in Telangana | Telangana News
x

బడిబాట కార్యక్రమాన్ని వెక్కిరిస్తున్న ప్రభుత్వ పాఠశాలలోని సౌకర్యాల కొరత

Highlights

*ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ముందుకుసాగని బడిబాట కార్యక్రమం

Badi Bata Program 2022: బడి ఈడు పిల్లలు బడిలో ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన బడిబాట కార్యక్రమం ఈ నెల 30 వరకు కొనసాగనుంది. ఈ నెల 3 నుంచి ప్రారంభమైన బడిబాట కార్యక్రమాన్ని ప్రభుత్వ అధికారులు నామమాత్రంగా నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. బడిబాట కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఉపాధ్యాయులు ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేయాలి. చదువుపై ప్రజలను చైతన్యపరచాలి. ప్రభుత్వ బడిలో అమలయ్యే సౌకర్యాలపై అవగాహన కల్పించాలి. కానీ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బడిబాట కార్యక్రమం ఆదిలోనే హంసపాదు అన్నట్లుగా సాగుతుంది. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కొరత బండిబాట కార్యక్రమాన్ని వెక్కిరిస్తోంది. అదనపు గదులు నిర్మాణం చేపట్టకపోవడం, మంచినీళ్లు, టాయిలెట్లు, స్కూల్లో చుట్టూ ప్రహరీ లేకపోవడం, వంట డైనింగ్ గదులు పూర్తిస్థాయిలో లేకపోవడంతో బడిబాట లక్ష్యం నీరుగారిపోతంది.

బడి బాట కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు లేకుండానే నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా బడిబయట ఉన్న పిల్లలను బడిలో చేర్పించాలి. ప్రభుత్వ బడుల్లో ఉన్న మౌలిక వసతులను విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు వివరించాలి. అదేమీ లేకుండానే వచ్చామా పోయామా అన్నట్లుగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని ప్రభుత్వ బడులను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది.

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవడం కోసం చాలా మంది విద్యార్థులు ఆసక్తిగా ఉన్నారు. కానీ పేరెంట్స్‌ను సరిగ్గా గైడ్ చేసేవారే లేరని కొందరు స్థానికులు వాపోతున్నారు. తల్లిదండ్రులకు చైతన్యపరిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు ఫుల్ అవుతాయని అంటున్నారు స్థానికులు.

బడి బాట కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు 150 నుంచి 200 మంది కొత్తగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరుతున్నారు. గతేడాది కంటే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య భారీగా పెరుగుతుంది. స్కూల్లో మంచి సౌకర్యాలు ఏర్పాటు చేశాం. కాబట్టి బడిబాట కార్యక్రమం తప్పకుండా విజయవంతం చేస్తామంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories