కుక్కకు ఘనంగా శ్రీమంతం..అతిధులకు విందు భోజనం

కుక్కకు ఘనంగా శ్రీమంతం..అతిధులకు విందు భోజనం
x

కుక్కకు ఘనంగా శ్రీమంతం..అతిధులకు విందు భోజనం

Highlights

*ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో వైభవంగా కుక్క శ్రీమంతం వేడుకలు *కుక్కను పెంచుకుంటున్న నవ కుమార్, ఆశా దంపతులు *పెంపుడు కుక్కకు స్టెఫీ అని ముద్దు పేరు పెట్టిన యజమానులు శ్రీమంతం రోజున ఘనంగా విందు భోజనాలు ఏర్పాటు

గర్భంతో ఉన్న మహిళలకు శ్రీమంతం నిర్వహించడం సాధారణం. అదే శ్రీమంతం గర్బంతో ఉన్న కుక్కకు చేస్తే వింత అవుతుంది. ఈ వింత ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. తాము అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కుక్కకు ఓ కుటుంబం శ్రీమంతం నిర్వహించింది. అంగరంగ వైభవంగా శ్రీమంతం వేడుకలు జరిపింది. కుక్కపై తమకున్న ప్రేమను చాటుకుంది.

ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం లోని NTR కాలనీలో నివాసముంటున్న నవ కుమార్, ఆశా దంపతులు ఏడాది క్రితం చిన్న కుక్క పిల్లను తెచ్చుకుని పెంచుకుంటున్నారు. కుక్కను ప్రాణం కంటే మక్కువ గా పెంచుకుంటున్నారు. కుక్కను కుక్క అని పిలవడానికి కూడా వారు ఇష్ట పడరు. ఆ పెంపుడు జంతువుకు స్టెఫీ అని ముద్దు పేరు పెట్టారు. ఇప్పుడు ఆ స్టెఫీకి వైభోవంగ శ్రీమంతం చేశారు.

శ్రీమంతం రోజున ఆ వీధిలో ఉన్న వారందరికీ చక్కటి విందు భోజనాలు ఏర్పాటు చేశారు. ఇంటి ముందు టెంట్ వేసి..చక్కటి డెకరేషన్ చేశారు. సొంత ఇంట్లో ఒక ఆడ పిల్లకు ఎలా అయితే శ్రీమంతం చేస్తారో అలాగే స్టెఫీకి శ్రీమంతం చేశారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న స్టెఫీ శ్రీమంతానికి బంధు, మిత్రులను ఆహ్వానించారు. ఫంక్షన్ కు వచ్చిన మహిళలు స్టెఫీకి మంగళ హారతులు ఇచ్చారు. ఫంక్షన్‌కు వచ్చిన అతిధులకు మంచి విందు భోజనం పెట్టారు నవకుమార్ దంపతులు. ఒక ఫంక్షన్‌లా చేసి ఆ ఇంటి యజమానులు స్టెఫీను చూసి ఎంతో మురిసి పోయారు.

Show Full Article
Print Article
Next Story
More Stories