Avinash Reddy: అవినాశ్‌రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా
Avinash Reddy: తదుపరి విచారణను ఏప్రిల్ 4కు వాయిదా వేసిన హైకోర్టు
Avinash Reddy: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు చేయాలని దాఖలన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరికి బెయిల్ రద్దు చేయాలని కోరే అవకాశం లేదని అవినాష్ తరపు న్యాయవాది వాదించారు. నెల రోజుల క్రితమే NIA కేసులో అప్రూవర్ వేసిన పిటిషన్‌ను డివిజన్ బెంచ్ అనుమతించిందని హైకోర్టు పేర్కొంది. అప్రూవర్‌కు అడిగే హక్కు ఉందని డివిజన్ బెంచ్ తీర్పులో స్పష్టంగా ఉందని తెలిపింది. ఈ మేరకు దస్తగిరి పిటిషన్‌ను తిరస్కరించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 4కు వాయిదా వేసింది. మరోవైపు భాస్కర్‌రెడ్డి, ఉదయ్ కుమార్‌రెడ్డి బెయిల్ పిటిషన్లపై సీబీఐ కౌంటర్ దాఖలు చేయగా... విచారణను హైకోర్టు ఏప్రిల్ 3కు వాయిదా వేసింది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire