GHMC కమిషనర్‌గా ఆమ్రపాలి రిలీవ్.. ఆ స్థానంలో ఇళంబర్తికి అదనపు బాధ్యతలు

GHMC కమిషనర్‌గా ఆమ్రపాలి రిలీవ్.. ఆ స్థానంలో ఇళంబర్తికి అదనపు బాధ్యతలు
x
Highlights

GHMC: జిహెచ్ఎంసి కమిషనర్‌గా ఆమ్రపాలిని రిలీవ్ చేసింది ప్రభుత్వం. ఏపీలో రిపోర్టు చేయాల్సిందిగా డీవోపీటీ ఉత్వర్వులు ఇవ్వగా.. క్యాట్‌తో పాటు హైకోర్టును ఆశ్రయించారు ఆమ్రపాలి.

GHMC: జిహెచ్ఎంసి కమిషనర్‌గా ఉన్న ఆమ్రపాలిని ప్రభుత్వం రిలీవ్ చేసింది. ఏపీలో రిపోర్టు చేయాల్సిందిగా డీవోపీటీ ఉత్వర్వులు ఇవ్వగా ఆమ్రపాలి ముందుగా క్యాట్‌ని ఆశ్రయించారు. అక్కడ తీర్పు అనుకూలంగా రాకపోవడంతో తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తనని తెలంగాణలోనే కొనసాగించాలని అభ్యర్థించారు. అయితే రెండుచోట్ల ఆమె అభ్యర్థనను తిరస్కరించడంతో.. ప్రభుత్వం ఆమెను GHMC కమిషనర్ పదవి నుంచి రిలీవ్ చేసింది.

ఆమె స్థానంలో ఇంచార్జ్ కమిషనర్‌గా ఐఏఎస్ ఇళంబర్తికి అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం ఇళంబర్తి ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌గా కొనసాగుతున్నారు.

తెలంగాణ నుండి ఏపీకి బదిలీ అయిన ఐఏఎస్‌ల స్థానాల్లో ఎనర్జీ సెక్రటరీగా సందీప్ కుమార్ సుల్తానియా, ఉమెన్స్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సెక్రటరీగా శ్రీదేవి, టూరిజం అండ్ కల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా శ్రీధర్, ఆరోగ్య శ్రీ సీఈవోగా ఆర్వీ కర్ణన్‌కు అదనపు బాధ్యతలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read: Amrapali Kata: ఆమ్రపాలికి దక్కని ఊరట..ఏపీలో రిపోర్ట్ చేయాలి: హైకోర్టు

Show Full Article
Print Article
Next Story
More Stories