Arvind Dharmapuri: కేసీఆర్.. రేవంత్ తోడు దొంగలు

Arvind Dharmapuri Comments On KCR And Revanth Reddy
x

Arvind Dharmapuri: కేసీఆర్.. రేవంత్ తోడు దొంగలు

Highlights

Arvind Dharmapuri: కల్వకుంట్ల కుటుంబంతో రేవంత్ పార్టనర్‌గా కొనసాగుతున్నారు

Arvind Dharmapuri: కేసీఆర్... రేవంత్... తోడుదొంగలని, కామారెడ్డిలో కేసీఆర్‌ను గెలిపించేందుకు రేవంత్ పోటీ చేస్తున్నారని, బీసీలకు అన్యాయం చేసిన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను తరిమికొట్టాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పిలుపునిచ్చారు. కల్వకుంట్ల కుటుంబంతో రేవంత్ పార్టనర్‌గా కొనసాగుతున్నారని ఆ‍యన ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా బోధన్‌లో యువశక్తి విజయ సంకల్పసభకు ఎంపీ ధర్మపురి అర్వింద్ హాజరయ్యారు. సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అన్నిరకాలుగా దోచుకున్నాడన్నారు.

కాంగ్రెస్ పార్టీకి మరో అవకాశం ఇస్తే కేసీఆర్‌ను మించి రాష్ట్రాన్ని దోచుకుంటారని ఆరోపించారు.. బోధన్‌లో బీజేపీని గెలిపించాలని, మూతబడిన ఫ్యాక్టరీలు తెరిపించే బాధ్యత బీజేపీదేనన్నారాయన... బీజేపీ గెలవగానే మూతబడిన ఫ్యాక్టరీలను తెరిపించి రైతులకు అండగా నిలుస్తామన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories