Phone Tapping Case: ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై..నాంపల్లి కోర్టులో ముగిసిన వాదనలు

Arguments On The Bail Petition Of The Accused In The Tapping Case Ended In The Nampally Court
x

Phone Tapping Case: ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై..నాంపల్లి కోర్టులో ముగిసిన వాదనలు 

Highlights

Phone Tapping Case: బెయిల్ పిటిషన్లపై తీర్పును శుక్రువారానికి నాంపల్లి కోర్టు వాయిదా

Phone Tapping Case: ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై నాంపల్లి కోర్టులో ఇవాళ వాదనలు ముగిశాయి. భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావులకు బెయిల్ ఇవ్వొద్దని న్యాయస్థానాన్ని పోలీసులు కోరారు. ఈ నేపథ్యంలో వారి బెయిల్ పిటిషన్లపై తీర్పును శుక్రువారానికి నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. అయితే పోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై సోమవారం విచారణ జరిగింది. నిందితులుగా ఉన్న రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్‌రావుల బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు.

అందుకు ప్రతీగా పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. ఈ సందర్బంగా నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్లపై ఇరు పక్షాల వాదనలు జరిగాయి. నిందితులకు బెయిల్ ఇస్తే.. సాక్ష్యులను ప్రభావితం చేస్తారని కోర్టుకు పోలీసులు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం కేసును.. ఏప్రిల్ 24 తేదీకి వాయిదా వేసింది. ఈ రోజు సైతం వాదనలు బలంగా జరిగాయి. ఆ క్రమంలో నిందితులు బెయిల్ మంజూరు చేయవద్దంటూ.. న్యాయస్థానాన్ని పోలీసులు మరోసారి కోరారు. ఆ క్రమంలో బెయిల్ పిటిషన్లపై తీర్పు శుక్రవారానికి నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. అయితే నిందితులకు బెయిల్ వస్తుందా ? రాదా? అనే అంశంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories