బీఆర్‌ఎస్‌ పార్టీలోకి ఏపీ నేతలు.. రేపు కేసీఆర్‌ సమక్షంలో చేరికలు..!

AP Leaders Join BRS Party Tomorrow In Presence Of KCR
x

బీఆర్‌ఎస్‌ పార్టీలోకి ఏపీ నేతలు.. రేపు కేసీఆర్‌ సమక్షంలో చేరికలు..!

Highlights

BRS: తెలంగాణ భవన్‌లో రేపు సా. 4 గంటలకు చేరికలు

BRS: BRS విస్తరణపై కేసీఆర్ దృష్టి సారించారు. ఇందులో భాగంగా.. ఏపీలో BRS అధ్యక్షుడిని నియమించబోతున్నట్లు తెలుస్తోంది. రేపు బీఆర్ఎస్ పార్టీలో ఏపీ నుంచి చేరికలు ఉండనున్నాయి. తెలంగాణ భవన్‌లో రేపు సాయంత్రం 4 గంటలకు BRSలో చేరనున్నారు మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్. ఆయనతో పాటు మాజీ మంత్రి రావెల కిశోర్‌ బాబు గులాబీ కండువా వేసుకోనున్నారు. ఇక మాజీ ఐఆర్‌ఎస్ పార్థసారధి.. కేసీఆర్ సమక్షంలో BRSలో చేరనున్నారు.

భారీ ర్యాలీతో రేపు మధ్యాహ్నం తోట చంద్రశేఖర్‌ హైదరాబాద్‌కు రానున్నారు. కొంత కాలంగా చంద్రశేఖర్‌ జనసేనకు దూరంగా ఉంటున్నారు. గత ఎన్నికల్లో గుంటూరు నుంచి జనసేన తరఫున చంద్రశేఖర్ పోటీ చేశారు. పీఆర్పీ, వైసీపీలో యాక్టివ్‌గా పని చేశారు. ఇక రావెల కిశోర్‌ బాబు టీడీపీ హయాంలో మంత్రిగా పని చేశారు. జనసేన, బీజేపీలో పని చేసిన రావెల.. ప్రస్తుతం సైలెంట్‌గా ఉన్నారు. BRSలో చేరికలను ఏపీ యూత్ స్టూడెంట్స్‌ జేఏసీ స్వాగతించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories