Another Siddipeta Brand product : మార్కెట్ లోకి మరో సిద్ధిపేట బ్రాండ్ ఉత్పత్తి

Another Siddipeta Brand product : మార్కెట్ లోకి మరో సిద్ధిపేట బ్రాండ్ ఉత్పత్తి
x
Highlights

Another Siddipeta Brand product : మార్కెట్ లోకి మరో సిద్దిపేట బ్రాండ్ ఉత్పత్తి అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే సిద్దిపేట పచ్చళ్ళు పేరుతో మార్కెట్...

Another Siddipeta Brand product : మార్కెట్ లోకి మరో సిద్దిపేట బ్రాండ్ ఉత్పత్తి అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే సిద్దిపేట పచ్చళ్ళు పేరుతో మార్కెట్ లోకి వచ్చిన పచ్చళ్ళకు మంచి ఆదరణ వచ్చింది. తాజాగా సిద్దిపేట పప్పులు మార్కెట్ లోకి వచ్చాయి. సిద్ధిపేట మహిళలు పొదుపు సంఘాలుగా మారి కొత్త కొత్త ఆవిష్కరణలతో అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మంత్రి హరిష్ రావు ప్రోత్సహాంతో సిద్ధిపేట నియోజకవర్గంలోని ఇర్కోడ్ గ్రామల్లో సిద్ధిపేట పచ్చళ్లు పేరుతో వెజ్, నాన్ వెజ్ పచ్చళ్లను మార్కెట్లోకి తీసుకొచ్చి అమ్ముతున్నారు. వీటికి చుట్టపక్కల మంచి ఆదరణ వచ్చింది.

ఇర్కొడ్ గ్రామాన్ని స్పూర్తిగా తీసుకుని మిట్టపల్లి గ్రామైఖ్య సంఘాల మహిళలు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను స్థాపించారు. మార్కెట్‌లోకి అన్ని రకాల పప్పు దినుసులను అందుబాటులోకి తెచ్చారు. తమ గ్రామం పేరు మీదుగా మిట్టపట్టి పప్పులు అనే బ్రాండ్ పేరుతో ఉన్న ప్యాకేజింగ్ ప్రమాణాలతో మార్కెట్ లోకి తీసుకొచ్చారు. ఇటీవల మంత్రి హరిష్ రావు చేతుల మీదుగా ఈ పప్పుదినుసుల అమ్మకాలు ప్రారంభం అయ్యాయి.

మిట్టపల్లి గ్రామంలో వివిధ గ్రామైక్య సంఘాల లో ఉన్న 15 మంది మహిళలు కలిసి ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ను స్థాపించారు. మంత్రి హరీష్ రావు ఆర్థిక చేయూత తో పాటు బ్యాంక్ లోన్ తీసుకున్నారు. రైతుల నుండి నేరుగా పప్పు ధాన్యాలను సేకరించి పప్పులను తయారు చేస్తున్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యుల నుండి వ్యాపార వేత్తలు గా ఎదుగుతున్న సిద్దిపేట మహిళలు అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories