ఆర్టీసీ ప్రయాణికులకు మరో షాక్.. మరోసారి తప్పని టికెట్ చార్జీల బాదుడు!

Another shock for RTC passengers
x

ఆర్టీసీ ప్రయాణికులకు మరో షాక్... 

Highlights

TS RTC: ఆర్టీసీ ప్రయాణికులకు మరో షాక్.. మరోసారి తప్పని టికెట్ చార్జీల బాదుడు!

TSRTC: నిత్యావసర ధరల పెరుగుదలతో అల్లాడుతున్న సామాన్యుడిపై ఆర్టీసీ రూపంలో మరో పిడుగు పడే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో ఆర్టీసీ చార్జీలు మరోసారి పెరగనున్నట్లు తెలుస్తోంది. కిలోమీటర్‌ వారీగా డీజిల్‌ సెస్‌ విధించాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. గతంలో రౌండప్‌, టోల్‌ ప్లాజాలు, ప్యాసింజర్స్‌ సెస్‌ పేరిట ఒకసారి ఛార్జీలు పెంచిన ఆర్టీసీ. ఏప్రిల్‌లో డీజిల్‌ సెస్‌ పేరుతో ప్రయాణికులపై భారం మోపింది. తాజాగా తెలంగాణ ఆర్టీసీ మరోసారి డీజిల్ సెస్ పెంచేసింది. దీంతో తెలంగాణ బస్సుల్లో ప్రయాణించే వారికి ఛార్జీల బాదుడు మరోసారి తప్పేలా లేదు.

ప‌ల్లెవెలుగు సర్వీసుల్లో- 250 కి.మీ దూరానికి రూ.5 నుంచి 45 రూపాయలు పెంచారు. ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుల్లో- 500 కి.మీ వరకు దూరానికి రూ.5 నుంచి రూ.90 పెంచారు. డీల‌క్స్‌ సర్వీసుల్లో- 500 కి.మీటర్ల దూరానికి రూ.5 నుంచి రూ.125 పెంచారు. సూప‌ర్ ల‌గ్జరీ సర్వీసుల్లో- 500 కి.మీటర్ల దూరానికి రూ.10 నుంచి రూ.130 పెంచారు. ఇందులో హర్షించదగ్గ విషయమేమిటంటే.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రమే డీజిల్ సెస్ పెంపులేదని తెలుస్తుంది. దీంతో గ్రేటర్ బస్సుల్లో ప్రయాణించే ఈ ప్రయాణికులకు ఎలాంటి ప్రభావం కనిపించకపోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories