Water Issue: శ్రీశైలం డ్యామ్‌ వద్ద ఏపీ పోలీసుల భద్రత

Andhra Pradesh Police Security at Srisailam Dam
x

శ్రీశైలం వద్ద పోలీసుల పహారా (ఫైల్ ఇమేజ్)

Highlights

Water Issue: శ్రీశైలం డ్యామ్‌ వద్ద ఏపీ పోలీసుల భద్రత * స్పెషల్ పార్టీ పోలీసులతో పహారా

Water Issue: తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల నేపథ్యంలో శ్రీశైలం జలాశయం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందుగా ఆనకట్ట వద్దకు స్థానిక పోలీసులు చేరుకున్నారు. ఎడమగట్టు జల విద్యుత్‌ కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్పత్తి కొనసాగిస్తోంది. దీంతో ఎడమగట్టు విద్యుత్‌ కేంద్రం వద్ద తెలంగాణ పోలీసులు.. శ్రీశైలం డ్యాం వద్ద ఆంధ్రా పోలీసులు మోహరించారు. తెలంగాణ ప్రభుత్వం ఎడమ గట్టు విద్యుత్‌ కేంద్రంలో విద్యుదుత్పత్తిని కొనసాగించడంతో రోజూ 4టీఎంసీల నీరు దిగువకు వెళుతోంది.

మరోవైపు ఏపీ ప్రభుత్వం దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. శ్రీశైలంలో 854 అడుగుల కంటే ఎక్కువ నీరు ఉంటేనే పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమ జిల్లాలకు నీటిని తరలించే అవకాశం ఉంటుందని.. లేదంటే సీమ ప్రాంతం ఎడారి అవుతుందని ఏపీ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇరు రాష్ట్రాల జల వివాదాల నేపథ్యంలో కృష్ణా బేసిన్‌లోని జూరాల, నాగార్జునసాగర్‌, పులిచింతల ప్రాజెక్టుల వద్ద కూడా పోలీసు పహారా కొనసాగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories