MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత కేసు విచారణలో ఊహించని ట్విస్ట్

An Unexpected Twist In The MLC Kavitha Case
x

MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత కేసు విచారణలో ఊహించని ట్విస్ట్

Highlights

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్క్యాం కేసులో కీలక పరిణామం

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్ తీస్ హజారీ కోర్టుకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో జస్టిస్ కావేరి భావేజా నియమితులయ్యారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ, ఇతర కేసులను విచారించనున్నారు. అలాగే ఢిల్లీ హైకోర్టు జ్యూడిషియల్ సర్వీసెస్ లోని మరో 26 మంది జడ్జీలు బదిలీ అయ్యారు. లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన కవితకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు స్పెషల్ జడ్జి నాగ్ పాల్ ఏడు రోజుల కస్టడీ విధించిన సంగతి తెలిసిందే.మార్చి 15న అరెస్టయిన కవిత ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు.

మార్చి 23 వరకు కవిత కస్టడీలోనే ఉండనున్నారు. లిక్కర్ స్కాం కేసులోఆప్ నేతలకు కవిత రూ. 100 కోట్లు చెల్లించారని ఈడీ ప్రకటించిన సంగతి తెలిసిందే..మరో వైపు తిహార్ జైల్లో కలుద్దామంటూ ఈ కేసులో మరో నిందితుడైన సుఖేష్ చంద్రశేఖర్ కవితకు లేఖ రాయడం కలకల రేపింది. సినిమా క్లైమాక్స్ చేరుకుందని..కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అవుతారని లేఖలో తెలిపాడు.కవిత అరెస్టయినప్పటి నుంచి కవిత కుటుంబ సభ్యులు ఢిల్లీలోనే ఉంటున్నారు. కేటీఆర్, హరీశ్ రావు ప్రతి రోజు సాయంత్రం కవితను కలుస్తున్నారు. మార్చి19న సాయంత్రం కూడా కవితను ఈడీ ఆఫీసులో కలిసి మాట్లాడి వెళ్లిపోయారు కేటీఆర్.

Show Full Article
Print Article
Next Story
More Stories