కాంగ్రెస్‌లో ఆపరేషన్ మునుగోడు ప్రారంభం

An Early Start to The Operation in Congress
x

కాంగ్రెస్‌లో ఆపరేషన్ మునుగోడు ప్రారంభం

Highlights

Congress Campaign: ఇవాళ్టి నుంచి నియోజకవర్గంలో ఆజాదీ గౌరవ్ యాత్రలు

Congress Campaign: మునుగోడుపై కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. గత కొన్ని రోజులుగా గాంధీభవన్‌లో చర్చల్లో మునిగిన రాష్ట్రనాయకత్వం డైరెక్ట్‌గా రంగంలోకి దిగబోతోంది. మన మునుగోడు, మన కాంగ్రెస్ పేరుతో క్యాంపెయిన్ ప్రారంభించబోతోంది. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను చుట్టి రావడంతో పాటు ప్రజల మద్దతును కూడగట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అందులో భాగంగా మూడంచెల కార్యాచరణను కాంగ్రెస్ పార్టీ రూపొందించింది. అధికార టీఆర్ఎస్‌ను ఎదుర్కోవడంతో పాటు దూకుడు మీదున్న బీజేపీకి చెక్ పెట్టే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రణాళికలు రచించింది.

పార్టీ ముఖ్యనాయకులంతా నియోజకవర్గంలోని 175 గ్రామాలలో పర్యటించాలని నిర్ణయించారు. అలాగే ఇవాళ్టి నుంచి 16 వరకు నియోజకవర్గంలో ఆజాదీ గౌరవ్ యాత్రలు నిర్వహించనున్నారు. సంస్థాన్‌ నారాయణపురం నుంచి చౌటుప్పల్ వరకు 13 కిలోమీటర్లు నిర్వహించే యాత్రకు రేవంత్ రెడ్డి సహా ఇతర ముఖ్య నేతలు హాజరుకానున్నారు. అలాగే మండలాల వారీగా సమావేశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశాలకు కూడా రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క తో పాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు హాజరుకానున్నారు.

మరోవైపు తనను పార్టీలో అవమానిస్తున్నారంటూ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై డైరెక్ట్‌గా అధిష్టానంతోనే తేల్చుకుంటానని స్పష్టం చేశారు. దీనిపై సోనియా, రాహుల్ కు ఫిర్యాదు చేస్తానన్న ఆయన తన నియోజకవర్గంలో తనకే చెప్పకుండా సభ ఏర్పాటు చేస్తామని ఎలా నిర్ణయం తీసుకుంటామన్నారు. పిలవని పేరంటాలకు వెళ్లనన్న వెంకట్‌రెడ్డి తనను దూషించిన వారిని పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయరని ప్రశ్నించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories