Amit Shah: నేటి నుంచి 3 రోజులపాటు రాష్ట్రంలో అమిత్‌ షా పర్యటన

Amit Shah will Visit the State for 3 Days from Today
x

Amit Shah: నేటి నుంచి 3 రోజులపాటు రాష్ట్రంలో అమిత్‌ షా పర్యటన

Highlights

Amit Shah: ఆర్మూర్‌లో సకల జనుల విజయ సంకల్ప సభకు అమిత్ షా

Amit Shah: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు మరో ఆరు రోజులే ఉండటంతో.. ఢిల్లీ నుంచి బీజేపీ పెద్దలు రాష్ట్రానికి క్యూ కడుతున్నారు. ఈరోజు నుంచి మూడు రోజుల పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆర్మూర్‌‌లో నిర్వహిస్తున్న సకల జనుల సంకల్ప సభకు ముఖ్య అతిథిగా హాజరవనున్నారు. మధ్యాహన్నం 2 గంటలకు రాజేంద్రనగర్‌లో, 3 గంటలకు శేరిలింగంపల్లిలో, సాయంత్రం 5 గంటలకు అంబర్‌పేటలో రోడ్ షో నిర్వహించనున్నారు. రేపు కొల్లాపూర్, మునుగోడు, పటాన్‌చెరులో సకల జనుల సంకల్ప సభల్లో పాల్గొననున్నారు. 26న మక్తల్, ములుగు, భువనగిరి, కూకట్‌పల్లిలో రోడ్ షోలో పాల్గొననున్నారు.

అమిత్ షాతోపాటు.. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉదయం 11 గంటలకు మేడ్చల్‌లో, సాయంత్రం 4 గంటలకు కార్వాన్ నియోజకవర్గంలో.. తర్వాత 5 గంటలకు కంటోన్మెంట్లో జరగనున్న బహిరంగ సభలలో పాల్గొననున్నారు. రేపు హుజూర్‌నగర్, సికింద్రాబాద్, ముషీరాబాద్‌లో జేపీ నడ్డా రోడ్ షోలు నిర్వహించనున్నారు. పలు ప్రాంతాల్లో ముఖ్య నేతలు ప్రాచారాలు నిర్వహించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories