తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయంగా అమిత్ షా, పవన్ సమావేశం

Amit Shah And Pawan Kalyan Meeting To Discuss Telangana Politics
x

తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయంగా అమిత్ షా, పవన్ సమావేశం

Highlights

Pawan Kalyan-Amit Shah: ఖమ్మం, కూకట్ పల్లి, శేరిలింగంపల్లి ఇచ్చేందుకు బీజేపీ సుముఖం

Pawan Kalyan-Amit Shah: పవన్ కళ్యాణ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిగిన భేటీలో పొత్తుపై కాస్త క్లారిటీ వచ్చినట్లే కనిపిస్తోంది. తెలంగాణ ఎన్నికల్లు సీట్ల పంపకాలు, పొత్తు, మద్దతుపై చర్చించేందుకు బీజేపీ ఆహ్వానం మేరకు నిన్న ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో కలిసి ఒకే ఫ్లైట్‌లో ఢిల్లీకి హడావిడిగా బయలుదేరి వెళ్లిన పవన్.. సాయంత్రం అమిత్ షాను కలిశారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య జరిగిన చర్చలో తెలంగాణ ఎన్నికలపై ముందుగా చర్చ జరిగింది. ఇందులో పవన్‌కు అమిత్ షా ముందుగా తెలంగాణ ఎన్నికల్లో తమకు సహకరించాలని కోరినట్టు తెలుస్తోంది.

అయితే పవన్ కళ్యాణ్ - అమిత్ షా మధ్య ఏపీ గురించి ప్రస్తావన లేదని తెలుస్తోంది. వచ్చినా ఫైనల్ గా మాత్రం ఓ సంకేతం మాత్రం ఇచ్చినట్లు తెలుస్తోంది. ముందు తెలంగాణ ఎన్నికల్లో సహకరించండి.. ఆ తర్వాత ఏపీలో చూద్దామంటూ అమిత్ షా పవన్ కళ్యాణ్‌కు ప్రతిపాదించినట్టు సమాచారం. దీంతో పవన్ కూడా సరేనన్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో పొత్తులకు సంబంధించి టీడీపీ ప్రస్తావన రాలేదని తెలుస్తోంది. మరోవైపు ఏపీ అభివృద్దిలో తమ సహకారం ఉంటుందని అమిత్ షా చెప్పినట్టు సమాచారం. ఇందుకు అనుగుణంగానే ఇవాళ తెలంగాణలో సీట్ల ఖరారుకు బీజేపీ-జనసేన పార్టీల నేతలు సమావేశం అవుతున్నారు.

తెలంగాణ 33 సీట్లు కావాలని జనసేన నేతలు కోరుతున్నారు. కొన్ని రోజుల క్రితం 32 స్థానాల్లో జనసేన పోటీ చేస్తున్నట్టు పవన్ కల్యాణ్ చెప్పారు. అయితే జనసేన అడిగినన్ని సీట్లు ఇవ్వడానికి బీజేపీ సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది. కేవలం మూడు నుంచి ఆరు సీట్లు మాత్రమే జనసేనకు ఆఫర్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అమిత్ షాతో బేటీలో పవన్ కల్యాన్ 20 సీట్లు కావాలని అడిగినట్టు సమాచారం. ఖమ్మం, కూకట్ పల్లి, శేరిలింగంపల్లి ఇచ్చేందుకు బీజేపీ సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది.

రేపు అమిత్ షా హైదరాబాద్‌లో పర్యటిస్తున్నారు. సీట్ల గురించి రెండు వైపులా ఆమోదయోగ్యమైన నిర్ణయం వస్తుందా లేదా అనేది చూడాల్సి ఉంది. బీజేపీ నవంబర్ 1న కేంద్ర ఎన్నికల కమిటీలో చర్చించి రెండో జాబితాను విడుదల చేయనుంది. మరోవైపు అమిత్ షా, పవన్ కల్యాణ్ బేటీలో పొత్తులకు సంబంధించి టీడీపీ ప్రస్తావన రాలేదు. తెలంగాణలో టీడీపీతో కలిసి పోటీ చేసేందుకు బీజేపీ సిద్దంగా లేనట్టు తెలుస్తోంది. తెలంగాణలో టీడీపీ పోటీ చేస్తుందా లేదా అనేది తేలాల్సి ఉంది. టీడీపీ పోటీలో ఉన్నా ఒంటరిగానే బరిలోకి దిగాల్సి వస్తుంది.

ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో టీడీపీ ఒంటరిగా, జనసేన, బీజేపీ పొత్తులతో పోటీ చేస్తే ఏపీ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం పడుతుందనేది సర్వత్రా ఆసక్తిగా మారింది. ఏపీలో కూడా టీడీపీతో పొత్తుకు బీజేపీ సిద్ధంగా లేకపోతే ఏన్డీయేలో భాగస్వామిగా ఉన్న పవన్ కల్యాణ్ ఇరకాటంలో పడినట్టేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories