Amarnath Yatra 2021: జూన్‌ 28 నుంచి అమర్‌నాథ్‌ యాత్ర

Amarnath Trip From June 28th
x

ఫైల్ ఫోటో ది హన్స్ ఇండియా 

Highlights

Amarnath Yatra 2021: ఏప్రిల్‌ 1 నుంచి రిజిస్ట్రేషన్‌ ప్రారంభం * 75ఏళ్లు నిండిన వృద్ధులకు నో ఎంట్రీ

Amarnath Yatra 2021: అమర్‌నాథ్‌ యాత్ర జూన్‌ 28 నుంచి ప్రారంభంకానుంది. గత సంవత్సరం కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఈ యాత్ర రద్దైంది. అయితే ఈ ఏడాది జూన్‌ 28 నుంచి ఆగష్టు 22 వరకు నిర్వహించాలని అమర్‌నాథ్‌ ఆలయ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఇక 13 ఏళ్లలోపు బాల, బాలికలు.. 75 ఏళ్లు నిండిన వృద్ధులను ఈ యాత్రకు అనుమతిలేదు.

అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లే తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన భక్తులు ఏప్రిల్‌ 1 నుంచి తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. ఇక అమర్‌నాథ్‌ ‎ఆలయ కమిటీ గుర్తించిన ప్రభుత్వ ఆస్పత్రుల్లో భక్తులు ఆరోగ్య పరీక్షలు చేయించుకొని దరఖాస్తుకు ఆ ఆరోగ్య ధ్రువీకరణ పత్రాన్ని జతచేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా భక్తులు కరోనా నిబంధనలు పాటిస్తూ యాత్రకు వెళ్లాల్సి ఉంటుంది.

కరోనా వల్ల ప్రతిరోజు 7వేల 500 నుంచి 10వేల మంది భక్తులను మాత్రమే యాత్రకు అనుమతించనున్నారు. హెలికాప్టర్లలో కూడా భక్తులు వెళ్లవచ్చు. అయితే యాత్రకు వెళ్లే భక్తులు గ్రూప్‌ యాక్సిడెంటల్‌ ఇన్సురెన్స్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. కాగా అమర్‌నాథ్‌ యాత్రలో ఈ ఏడాది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories