Allu Arjun released: చంచల్ గూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల
Allu Arjun released: చంచల్ గూడ జైలు నుంచి సినీనటుడు అల్లు అర్జున్ విడుదలయ్యారు. శనివారం ఉదయం ఆయన్ను జైలు అధికారులు విడుదల చేశారు. సంధ్య థియేటర్ వద్ద...
Allu Arjun released: చంచల్ గూడ జైలు నుంచి సినీనటుడు అల్లు అర్జున్ విడుదలయ్యారు. శనివారం ఉదయం ఆయన్ను జైలు అధికారులు విడుదల చేశారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించిన అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు. అయితే తెలంగాణ హైకోర్టు నాలుగు వారాలపాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో న్యాయవాదులు బెయిల్ పత్రాలతోపాటు రూ. 50వేల పూచీకత్తును జైలు సూపరింటెండ్ కు సమర్పించారు. దీంతో అల్లు అర్జున్ ను విడుదల చేశారు. అల్లు అర్జున్ అభిమానులు భారీగా తరలిరావడంతో జైలు దగ్గర పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.
#WATCH | Hyderabad, Telangana: Actor Allu Arjun released from jail.
— ANI (@ANI) December 14, 2024
He was taken to Chanchalguda Central Jail yesterday after a Court sent him to a 14-day remand. Later, he was granted interim bail by Telangana High Court on a personal bond of Rs 50,000. pic.twitter.com/Xqu3KpBAt6
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire