Allu Arjun Latest News Updates: రేవతి కుటుంబానికి రూ.2 కోట్లు.. అందులో అల్లు అర్జున్ ఎంత ఇచ్చారంటే

Allu Arjun Latest News Updates: రేవతి కుటుంబానికి రూ.2 కోట్లు.. అందులో అల్లు అర్జున్ ఎంత ఇచ్చారంటే
x
Highlights

Allu Arjun's Sandhya Theatre Stampede Case latest news updates: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో చనిపోయిన రేవతి కుటుంబానికి రూ. 2 కోట్ల నష్ట పరిహారం...

Allu Arjun's Sandhya Theatre Stampede Case latest news updates: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో చనిపోయిన రేవతి కుటుంబానికి రూ. 2 కోట్ల నష్ట పరిహారం అందించనున్నట్లు పుష్ప 2 మూవీ యూనిట్ ప్రకటించింది. ఇందులో అల్లు అర్జున్ వైపు నుండి రూ. 1 కోటి, డైరెక్టర్ సుకుమార్ తరపున రూ. 50 లక్షలు, అలాగే ఆ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ రూ. 50 లక్షలు అందిస్తున్నట్లు తెలిపారు.

ఇవాళ దిల్ రాజుతో కలిసి అల్లు అరవింద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రేవతి కుమారుడు శ్రీతేజ్ ను పరామర్శించారు. ఆ తరువాత ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో అల్లు అరవింద్, దిల్ రాజు ఈ వివరాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ పుష్ప మూవీ యూనిట్ నుండి ఎవరెవరు ఎంత సాయం అందిస్తున్నారనే వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉన్నందున తాము చట్టరీత్యా ఆ కుటుంబాన్ని కలవొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వ ప్రతినిధి అయిన తెలంగాణ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజును మధ్యవర్తిగా తీసుకొచ్చినట్లు చెప్పారు (Dil Raju meets Revathi's family).

దిల్ రాజు ద్వారానే ఈ చెక్కులు రేవతి కుటుంబానికి అందజేస్తున్నట్లు అల్లు అరవింద్ (Allu Aravind press meet at KIMS hospital after visiting victim Sritej) తెలిపారు. డైరెక్టర్ సుకుమార్ విదేశాల్లో ఉన్నందున ఆయన ఇక్కడకు రాలేదని, సుకుమార్ తరపున ఆయన అన్న కొడుకు వచ్చారని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories