ACP Vishnu Murthy: అల్లు అర్జున్.. బీ కేర్ ఫుల్ అంటూ వార్నింగ్.. ఎవరీ విష్ణుమూర్తి?

Allu Arjun Faces Warnings Who is Vishnu Murthy
x

ACP Vishnu Murthy: అల్లు అర్జున్.. బీ కేర్ ఫుల్ అంటూ వార్నింగ్.. ఎవరీ విష్ణుమూర్తి?

Highlights

పోలీస్ శాఖలో పనిచేస్తున్న విష్ణుమూర్తి (Vishnu Murthy తీరు మొదటి నుంచి వివాదాలు, సంచలనాలకు కేంద్రంగా ఉంది.

పోలీస్ శాఖలో పనిచేస్తున్న విష్ణుమూర్తి (Vishnu Murthy తీరు మొదటి నుంచి వివాదాలు, సంచలనాలకు కేంద్రంగా ఉంది. తాజాగా సినీ నటులు అల్లు అర్జున్ పై(Allu Arjun) పై మీడియా సమావేశంలో ఆయన చేసిన కామెంట్స్ చర్చకు కారణమయ్యాయి. దీనిపై ఆయనపై శాఖపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

ఎవరీ విష్ణుమూర్తి?

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని జూలూరుపాడు గ్రామం విష్ణుమూర్తి. వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో పనిచేశారు.ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 1991లో ఆయన ప్రొబేషనరీఎస్ఐగా బాధ్యతలు చేపట్టారు. వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో టాస్క్ ఫోర్స్ ఏసీపీగా పనిచేస్తున్న సమయంలో ఆయనపై వచ్చిన ఆరోపణలతో 2024 అక్టోబర్ 22న ఆయనను సస్పెండ్ చేశారు.

ప్రస్తుతం ఆయన సస్పెన్షన్ లో ఉన్నారు. అప్పటి సీపీ కల్మేశ్వర్ విష్ణుమూర్తిపై వచ్చిన ఆరోపణలతో ఆయనపై ఓ నివేదికను తయారు చేసి డీజీపీ జితేంద్ర కు పంపారు. ఈ ఆరోపణలు రావడంతో ఆయనను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. సీపీ నివేదిక ఆధారంగా విష్ణుమూర్తిని సస్పెండ్ చేశారు. డిచ్ పల్లి ఏడో బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ గా పనిచేసిన విష్ణుమూర్తి ఏడాది క్రితం డిప్యూటేషన్ పై టాస్క్ ఫోర్స్ కు వచ్చారు.

సంచలనాలకు కేరాఫ్ విష్ణుమూర్తి

పోలీస్ శాఖలో విష్ణుమూర్తి చేసిన కార్యకలాపాలు సంచలనాలకు కేంద్రంగా మారాయి.వరంగల్ లో ఆయన పనిచేసే సమయంలో ఎస్ సీ అధికారులకు ప్రమోషన్స్ ఇవ్వడం లేదని ఓ అధికారి అర గుండు, అర మీసంతో ఆందోళన చేశారు. అప్పట్లో ఈ ఘటన పోలీస్ శాఖలో చర్చకు దారితీసింది. ఈ ఆందోళన వెనుక విష్ణుమూర్తి ఉన్నారనే అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. కానీ, దీన్ని ఆయన తోసిపుచ్చారు. రెబెల్ అధికారిగా ఆయనకు పోలీస్ శాఖలో పేరుంది.

విష్ణుమూర్తిపై చర్యలకు పోలీస్ శాఖ చర్యలు

అల్లు అర్జున్ అంశంపై అనుమతి తీసుకోకుండానే మీడియాతో మాట్లాడిన విష్ణుమూర్తిపై చర్యలు పోలీస్ శాఖ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ మీడియా సమావేశంపై ఉన్నతాధికారులకు నివేదిక పంపనున్నట్టు హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీ ఆక్షాంశ్ యాదవ్ (Akshansh Yadav) చెప్పారు. రాష్ట్రంలోని పోలీస్ శాఖలో పనిచేస్తున్న కుటుంబాల తరపున తాను మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్టుగా విష్ణుమూర్తి చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories