Telangana Election: తెలంగాణ ఎన్నికలకు సర్వం సిద్ధం

All Set For Telangana Assembly Elections 2023
x

Telangana Election: తెలంగాణ ఎన్నికలకు సర్వం సిద్ధం

Highlights

Telangana Election: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ సర్వం సిద్ధం చేస్తుంది.

Telangana Election: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ సర్వం సిద్ధం చేస్తుంది. ఎన్నికల ఏర్పాట్లపై కాసేపట్లో కేంద్ర ఎన్నికల సంఘం వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించనుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ఏర్పాట్లను శరవేగంగా పూర్తి చేస్తోంది. ఇప్పటికే 80 ఏళ్ల పైబడిన వారు ఓటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ ఎన్నికలకు 2 లక్షలకు పైగా పోస్టల్ బ్యాలెట్లను ఉద్యోగులు వినియోగించుకోనున్నారు. ఇవాళ్టి నుంచి రెండు రోజుల్లో పాటు ఎన్నికల సిబ్బందికి ట్రైనింగ్ ఇవ్వనున్నారు. 35 వేల 665 పోలింగ్ సెంటర్స్‌ను ఈసీ ఏర్పాటు చేయనుంది.

తాజాగా, ఎన్నికలకు ఓట్ల లెక్కింపు కేంద్రాలను కూడా ఖరారు చేసింది. 33 జిల్లాల్లో 49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ మేరకు రాష్ట్ర అధికారులు పంపిన ప్రతిపాదనలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. దీంతో ఆయా కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు కోసం అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు.

హైదరాబాద్ నగరంలో అత్యధికంగా 14 లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా, మిగిలిన 13 నియోజకవర్గాలకు విడిగా కేంద్రాలు ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లాలో నాలుగు, మిగిలిన జిల్లాల్లో ఒక్కొటి చొప్పున ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories