Telangana Pending Bills: తెలంగాణలో పథకాల అమలుకు నిధుల కొరత..!

All Bills are in Pending for the Implementation of Govt Schemes in Telangana | Telugu Online News
x

తెలంగాణ (ఫైల్ ఫోటో)

Highlights

*రాష్ట్రంలో పెండింగ్‌ బిల్స్‌ పెరిగిపోతున్నాయా..? *వేల కోట్లల్లో అప్పులు, బకాయిలు

Telangana Pending Bills: తెలంగాణ రాష్ట్రంలో పథకాలు అమలుకు నిధుల కటకట మొదలైందని ప్రభుత్వ వర్గాల్లో చర్చ నడుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధుకు ఒక్క హుజూరాబాద్‌కే 2వేల కోట్లు విడుదల చేసింది. మరో నాలుగు మండలాల్లో ఈ పథకాన్ని అమలు చేయాలని సర్కార్‌ భావిస్తోంది. ఇప్పటికే మండలాలను కూడా ఎంచుకోవడం జరిగింది.

ఇదిలా ఉంటే వివిధ శాఖల్లో చేపట్టిన పనులకు ప్రభుత్వం నిధులను నిలిపివేసిందని కాంట్రాక్టర్లతో పాటు ప్రభుత్వ అధికారులు చర్చించుకుంటున్నారు. రిటైర్డ్ ఎంప్లాయిస్‌కు బెనిఫిట్స్‌తో పాటు అవుట్‌ సోర్సింగ్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు జీతాలు చెల్లింపులు ప్రభుత్వం నుంచి అందడంలేదని లబోదిబో మంటున్నారు.

కరోనా ఫస్ట్‌, సెకండ్‌వేవ్‌లో ఉద్యోగులకు ఇవ్వాల్సిన మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ బిల్లులు ప్రభుత్వం క్లియర్‌ చేయలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక వివిధ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న బిల్లులు పరిశీలిస్తే ఇరిగేషన్‌శాఖలో 11వేల 6వందల కోట్లు, మిషన్ భగీరథలో 13వందల కోట్లు, పంచాయతీరాజ్‌లో 6వందల 50 కోట్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఆరోగ్యశ్రీ హెల్త్‌కు 3వందల కోట్లు, మహిళా సంఘాలకు 3వేల 100 కోట్లు, జీహెచ్‌ఎంసీకి 11 వందల కోట్లు, ఎడ్యుకేషన్‌కు 2వందల 50 కోట్లు, ఆర్‌ అండ్‌ బీకి 18వందల కోట్లు, పబ్లిక్ హెల్త్ 9వందల కోట్లు, గురుకులాల్లో 3వందల 50 కోట్లు, రుణమాఫీకి 15వందల కోట్లు, కళ్యాణలక్ష్మి 100 కోట్లు, పశుసంవర్ధక శాఖలో 150 కోట్ల బిల్స్ పెండింగ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇలా అన్ని శాఖల్లో పథకాలను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 4 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిందని అధికారులు తెలిపారు.

రాష్ట్రంలో ఉన్న కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులకు దాదాపు 8వేల కోట్ల మేర బకాయిలు ఉండటంతో పనులు నెమ్మదిగా జరుగుతున్నాయట. మిషన్‌ కాకతీయ పనులు చేసి ఏళ్లు గడుస్తున్నా కాంట్రాక్టర్లకు ఇంకా పెండింగ్‌ ఉన్నట్టు సమాచారం. అన్ని శాఖల్లో నిధుల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంట. ఇతర పథకాలకు నిధులు మళ్లించడంతోనే బిల్స్‌ పెండింగ్‌లో పడ్డాయని అధికారులు చెబుతున్నారంట. కాంట్రాక్టర్స్‌ బిల్స్‌ క్లియరెన్స్‌ కోసం ప్రతి రోజు కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నారని టాక్‌.

Show Full Article
Print Article
Next Story
More Stories