గులాబి ప్లీనరీకి సర్వం సిద్దం.. 22 వ వసంతంలోకి అడుగు.. 33 రకాల పసందైన వంటకాలు...

All Arrangements Done for TRS Formation Day 2022 with 33 Dishes | KCR | Live News
x

గులాబి ప్లీనరీకి సర్వం సిద్దం.. 22 వ వసంతంలోకి అడుగు.. 33 రకాల పసందైన వంటకాలు... 

Highlights

TRS Formation Day 2022: గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం నింపే విధంగా టీఆర్ఎస్ అడుగులు...

TRS Formation Day 2022: తెలంగాణ రాష్ర్ట సమితీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాడానికి గులాభీ శ్రేణులు సర్వం సిద్ధం చేశారు. టీఆర్ఎస్ 21 వసంతాలు పూర్తి చేసుకుని 22వ వసంతంలోకి అడుగు పెడుతోంది. ఇవాళ హెచ్ఐసీసీలో టీఆర్ఎస్ ప్లీనరికీ ఏర్పాట్లు పూర్తి చేశారు. నగరం నలువైపులా స్వాగత తోరణాలు, ప్రధాన కూడళ్ల దగ్గర పార్టీ జెండాలు, అధినేతల కటౌట్లను అలంకరించారు. ఎన్నికలకు ఇప్పటి నుంచే పార్టీ శ్రేణులను ప్రిపేర్ చేసి..వారిలో ఉత్సాహం నింపేలా పార్టీ అధిష్టానం అడుగులు వేస్తుంది.

ఉదయం పదకొండు గంటలకు పార్టీ ప్లీనరీ ప్రారంభం కానున్నది. మూడు వేల మంది ప్రతినిధులతో సభ జరగనున్నది. రాష్ర్ట మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, రాజ్యసభ, లోక్ సభ సభ్యులకు ఆహ్వానం పంపించారు. ప్రతినిధులంతా గులాబీ రంగు దుస్తులు ధరించి ప్లీనరీకి హాజరు కావాలని పార్టీ అధిష్టానం ఆదేశించింది. ఉదయం 10 గంటల వరకు ప్రతినిధులంతా ప్రాంగణానికి చేరుకుని.. పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంది.

ఈ సారి ప్రతినిధులకు బార్ కోడ్ తో కూడిన ప్రత్యేక పాస్ లు ఇచ్చారు. కోడ్ స్కాన్ చేసిన తర్వాతే లోపలకి అనుమతివ్వనున్నారు. పాస్ లేని వారు ఎవరూ రావొద్దని ఇప్పటికే తేల్చి చెప్పారు. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఉదయం 11 గంటలకు సభా వేదికకు చేరుకుని.. అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి.. తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాల వేసి పార్టీ జెండా ఆవిష్కరించిన అనంతరం సమావేశం ప్రారంభిస్తారు.

టీఆర్ఎస్ ప్లీనరీ సభతో తెలంగాణలో పొలిటకల్ హీట్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పార్టీలన్నీ ఎలక్షన్ మూడ్ లోకి వెళ్లాయి. తాజా రాజకీయ పరిణామాల నేఫధ్యంలో జరుగుతున్న టీఆర్ఎస్ ప్లీనరీలో తీసుకోనున్న నిర్ణయాలు.. తీర్మానాలపై ప్రాథాన్యం ఏర్పడింది. మొత్తం 11 తీర్మానాలు ప్రవేశపెట్టాలని గులాబీ దళపతి నిర్ణయించారు. వీటిలో మూడు రాజకీయ తీర్మానాలు ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణపై కేంద్రం వివక్ష, జాతీయ ప్రత్యామ్నాయ వేదిక లేదా కొత్త పార్టీ, దేశ పాలనలో కేంద్ర వైఫల్యాలపై తీర్మానాలుంటాయని గులాబీ వర్గాలు చెబుతున్నాయి. వీటితో పాటు టీఆర్ఎస్ అభివృద్ధి, సంక్షేమం, ఉద్యోగ నియామకాలు, పార్టీ సాధించిన విజయాలపై తీర్మానాలు ఉండే అకాశం ఉంది.

ఇప్పటికే రెండు దఫాలుగా అధికార పగ్గాలు చేపట్టిన టీఆర్ఎస్ ముచ్చటగా మూడోసారి జైత్రయాత్రను కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. అందుకు అనుగుణంగా కార్యారణ అమలు చేస్తుంది గులాబి దండు. 80 వేల 39 ఉద్యోగ నియామకాలు చేస్తామని ఇప్పటికే ప్రకటించిన టీఆర్ఎస్.. సొంతంగా ఇల్లు కట్టుకునే వారికి మూడు లక్షల రూపాయల సాయం, 57 ఏళ్లు దాటిన వారికి పింఛన్లు, జీవో 111 రద్దు, ధాన్యం కొనుగోల్లు ఇతర ఇఅంఎసాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకు వెళ్లేందుకు గులాభీ అధిపతి కేసీఆర్ దిశా నిర్దేశం చెసే అవకాశం ఉంది. ఇదే వేదిక నుంచి కీలక రాజకీయ తీర్మానాలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

టీఆర్ఎస్ ప్లీనరిలో సీఎం కేసీఆర్ అధినేత ప్రసంగం ఎంత ప్రత్యేకమో.. ప్లీనరీకి వచ్చే అతిధిలకు వడ్డించే వంటకాలకు అంత ప్రత్యేకత ఉంటుంది. వంటకాలంటే అలాంటి ఇలాంటి డిషెస్ కాదు.. ప్లీనరీలో పాల్గొనే నాయకులకు నచ్చిన వంటకం తినేలా వంటలు సిద్ధం చేస్తున్నారు. వచ్చిన ప్రతి నాయకుడి కడుపు నిండేలా వెరైటీ.. 33 కతాస పసందైన వంటకాలను వండుతున్నారు. నాన్ వెజ్ వంటకాల్లో తెలంగాణ నాటు కోడికూర, చికెన్ దమ్ భిర్యానీ, దమ్ కీ చికెన్ తలకాయ కూర, బోటి, మటన్ కర్రి, కోడిగుడ్డు పులుసు ఉన్నాయి.

ఇక శాఖాహారం వంటకాల్లో మామిడికాయ పప్పు, దొండకాయ, కాజుప్రై, ములక్కాడ, టమటా కర్రి, చామగడ్డ పులుసు, పప్పుచారు, గుత్తివంకాయ కర్రి ఉన్నాయి. వీటితో పాటు మిర్చి గసలా, ఆనియన్ రైతా, బగారా, వైట్ రైస్, మిక్స్ డ్ వెజ్ కుర్మా కూడా రెడీ చేస్తున్నారు. అప్పడం, రెండు మూడు రకల పచ్చల్లు.. ఉలవచారు, క్రీట్, టమాటా రంసం, పెరుగు, బటర్ స్కాచ్ ఐస్ క్రీం, అంబటి , బటర్ మిల్క్ వడ్డించనున్నారు. డబుల్ కా మీటా, గులాబ్ జామ్, మిర్చి బజ్జి, రుమాల్ రోటీతో గులాబీ ప్రతినిధులు ఫుల్ ఖుష్ చేయనున్నారు.

మరో వైపు ప్లీనరీ జరనున్న హైటెక్స్ మాదాపూర్ చుట్టుపక్కల భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ రోట్లో ప్రయాణించే వాహనదారులు ఆంశ్రలను దృష్టిలో ఉంచికొని ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించి రద్దీ నివారించాలని పోలీసులు సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories