Telangana: రేషన్‌ కార్డులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..!

Alert to Ration Card Holders All Ration Card Holders Have to Come to the Ration Shop and put Fingerprints in the Name of Know Your Customer
x

Telangana: రేషన్‌ కార్డులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..!

Highlights

Ration Card Holders: రేషన్‌కార్డుల ద్వారా ప్రజలకు ప్రభుత్వం తక్కువ ధరలకే సరుకులు అందిస్తుంది.

Ration Card Holders: రేషన్‌కార్డుల ద్వారా ప్రజలకు ప్రభుత్వం తక్కువ ధరలకే సరుకులు అందిస్తుంది. అయితే, కుటుంబంలో ఉన్న వారందరి పేర్లు ఇందులో చేర్చి, ఇంటికి సరిపడా సరుకులు అందిస్తుంది. కొత్త సభ్యుల వివరాలు చేర్చేందుకు ఎలాగైతే అవకాశం ఇస్తారో.. ఇంటిలో ఏ సభ్యుడైనా మరణిస్తే.. వారి వివరాలు కూడా తొలగిస్తుంటారు. కానీ, ఈ ప్రక్రియ ఇప్పుడు సక్రమంగా జరగడం లేదు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. కుటుంబంలో లేని వారి వివరాలను తొలగించేందుకు సరికొత్త నిర్ణయం అమలుచేయనుంది. రేషన్‌కార్డుల్లో కుంటుంబ సభ్యుల వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచనున్నారు. దీంతో ప్రతి రేషన్ కార్డుల్లోని కుటుంబ సభ్యులందరూ ఒకేసారి రేషన్‌ షాప్‌కి వచ్చి ఫింగర్ ఫ్రింట్స్ వేయాల్సి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.

ప్రస్తుతం రేషన్‌కార్డు ఉన్న వారు రేషన్‌ షాప్‌కి వచ్చి ఫింగర్ ఫ్రింట్ వేసి సరుకులు తీసుకొచ్చే వారు. అయితే, కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు వచ్చి బియ్యం తీసుకునేవారు. కాగా, కుటుంబ సభ్యుల్లో చనిపోయిన వారి పేర్లు మాత్రం అలాగే ఉండిపోయాయి. వీరి పేరిట కూడా సరుకులు తీసుకుంటున్నారు. అధికారులకు చనిపోయిన వారి సమాచారం ఇచ్చి, వారి పేర్లను తొలగించాల్సి ఉంటుంది. కానీ, ఈ ప్రక్రియ అనుకున్నట్లు జరగడంలేదు. దీంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

దూర ప్రాంతాల్లో ఉంటే..

ఈ నెల అంటే సెప్టెంబర్ 11 నుంచి ఈ ప్రక్రియ మొదలుకావాల్సి ఉంది. సాంకేతిక కారణాలతో ఈ ప్రక్రియ ఆగిపోయింది. కొద్ది రోజుల్లో ఈ ప్రక్రియ తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అయితే, దూర ప్రాంతాల్లో ఉన్న వారి గురించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. వారిపై క్లారిటీ ఇచ్చాకే ఈ నూతన ప్రక్రియ ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు.

ప్రతి కుటుంబంలో ఎవరెవరున్నారు అనే విషయం తెలుసుకునేందుకు రేషన్‌ కార్డుదారులంతా రేషన్‌ షాప్‌కి వచ్చి నో యువర్‌ కస్టమర్‌ పేరిట ఫింగర్ ఫ్రింట్స్ వేయాల్సి ఉంటుంది. దీంతో అన్ని కార్డుల్లో మరణించిన వారి వివరాలు తీసివేస్తారు. దీంతో రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయాల్సిన బియ్యం, సరకుల కోటా కూడా తగ్గుతుందని ప్రభుత్వం అంచానలు వేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories