Fish Prasadam: ఆస్తమా పేషెంట్స్​కు అలర్ట్.. చేప ప్రసాదం పంపిణీ డేట్స్ ఫిక్స్..

Alert for Asthma Patients Fish Prasadam Distribution Dates Fix
x

Fish Prasadam: ఆస్తమా పేషెంట్స్​కు అలర్ట్.. చేప ప్రసాదం పంపిణీ డేట్స్ ఫిక్స్..

Highlights

Fish Prasadam: ఈ మృగశిర కార్తె ప్రారంభమైన రోజు ఆస్తమా వంటి జబ్బులతో బాధపడే వరకు చేపపిల్లలను ఇస్తారు.

Fish Prasadam: ప్రతి సంవత్సరం మృగశిర కార్తె రోజు ఇచ్చే చేప మందు ప్రసాదం.. ఈ ఏడాది కూడా చేప ప్రసాదం ఇచ్చేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రసాద పంపిణీదారులు బత్తిన ఫ్యామిలీ తాజాగా కీలక ప్రకటన చేసింది. హైదరాబాద్‌‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జూన్ 8న ప్రసాదం పంపిణీ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ ప్రసాదం తింటే ఆస్తమా ఆస్తమా, ఉబ్బసం, దమ్ము, దగ్గు వంటి శ్వాస సంబంధ వ్యాధుల నివారణకు ప్రతి ఏటా పంపిణీ చేస్తారు.

ఈ మృగశిర కార్తె ప్రారంభమైన రోజు ఆస్తమా వంటి జబ్బులతో బాధపడే వరకు చేపపిల్లలను ఇస్తారు.ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో ఈ చేప మందును పెద్దఎత్తున ఆస్తమా బాధితులకు అందిస్తారు. తాజాగా ప్రసాదం పంపిణీ పై ప్రభుత్వ అనుమతి కూడా ఇప్పటికే తీసుకున్నట్లు తెలిసింది. మరోవైపు ప్రసాదం తయారీ ప్రక్రియను కూడా ప్రారంభించారు. ఈ క్రమంలోనే రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు చేప మందు కోసం పెద్ద ఎత్తున తరలివస్తుంటారు.

వాయిస్ 2ఏటా మృగశిర కార్తె ప్రవేశించిన రోజున ఈ ప్రసాదం బతికి ఉన్న చేపలో పెట్టి పంపిణీ చేస్తుంటారు. ఈ ఏడాది జూన్ 8న మృగశిర కార్తె ప్రవేశిస్తోంది. ఆ రోజు చేప ప్రసాదం పంపిణీ చేయబోతున్నట్టు బత్తిన అనురీత్‌గౌడ్, గౌరీ శంకర్‌ గౌడ్‌లు తెలిపారు. చేప ప్రసాదం పంపిణీ లో భాగంగా పంపిణీకి ముందు రోజు ప్రత్యేక పూజలు చేస్తారు. సత్యనారాయణ స్వామి వ్రతం, తర్వాత భావి పూజ చేసిన అనంతరం ప్రసాదం తయారీ ప్రక్రియ పూర్తి చేస్తారు. తర్వాత రోజు జూన్ 8 నుంచి పంపిణీ స్టార్ట్ అవుతుంది.

జూన్ 8న ప్రారంభమయ్యే ఈ కార్తె పదిహేను రోజుల పాటు ఉంటుంది. సూర్యుడు ప్రవేశం ఆధారంగా కార్తె నిర్ణయం జరుగుతుంది. ఈ క్రమంలోనే ఒక్కొక్క కార్తెలో ఒక్కో విధమైన వాతావరణ మార్పులు చోటుచేసుకుంటాయి.ఇప్పటివరకు వాతావరణంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యి ఈ కార్తె మొదలవగానే క్రమంగా చల్ల బడుతుంటాయి.అదే విధంగా వర్షాలు కూడా అధికంగా రావడంతో ఎన్నో రకాల సూక్ష్మజీవులు పునరుత్పత్తి జరిగే ప్రజలలో అనేక వ్యాధులు రావడానికి కారణమవుతాయి. ప్రజలలో రోగనిరోధకశక్తి మెరుగుపడటానికి అదేవిధంగా ఉన్న ఫలంగా శరీర ఉష్ణోగ్రతలు తగ్గకుండా మన శరీరానికి వేడిని కలుగ చేయడానికి మృగశిర కార్తె రోజు చేపలను తింటారు.

చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు చేపమందు ఎవరైనా వేసుకోవచ్చని, గర్భిణులు మాత్రం తీసుకోవద్దని బత్తిని కుటుంబ సభ్యులు సూచించారు. పడుగడుపున లేదా భోజనం తీసుకున్న మూడు గంటల తర్వాత మందు తీసుకోవాలన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో చేప మందు పంపిణీకి కౌంటర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి సరిపడా టాయిలెట్స్‌ కూడా ఏర్పాటు చేస్తున్నారు. దివ్యాంగులు, వృద్ధులు, మహిళల కోసం ప్రత్యేక క్యూలైన్లు, కౌంటర్లు ఉంటాయి. నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో రెండు రోజుల పంపిణీ చేస్తారు..చేప ప్రసాదం పంపిణీకి, భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు నిర్వాహకులు వివరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories