Cyclone Biparjoy: ముంచుకొస్తున్న బిపోర్‌జాయ్.. గుజరాత్‌లోని సౌరాష్ట్ర, కచ్ తీరాలకు ఆరెంజ్ అలర్ట్

Alert as Cyclone Biporjoy to landfall Heavy Rains Expected in Gujarat
x

Cyclone Biparjoy: ముంచుకొస్తున్న బిపోర్‌జాయ్.. గుజరాత్‌లోని సౌరాష్ట్ర, కచ్ తీరాలకు ఆరెంజ్ అలర్ట్  

Highlights

Cyclone Biparjoy: 38వేల మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు

Cyclone Biparjoy: బిపోర్ జాయ్ తుఫాన్ ముంచుకొస్తోంది. రేపు సాయంత్రం గుజరాత్ లోని జకావు పోర్ట్ వద్ద తీరాన్ని దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీంతో గుజరాత్ లోని సౌరాష్ట్ర, కచ్ తీరాలకు, రాజస్థాన్ కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తుఫాను ప్రభావం రాజస్థాన్ లోనూ 12 జిల్లాల్లో తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. గుజరాత్‌ను బిపోర్‌జాయ్​తుపాను వణికిస్తుంది. ద్వారక, పోర్‌బందర్, జామ్‌నగర్, రాజ్‌కోట్, జునాఘర్ మరియు గిర్-సోమ్‌నాథ్ వద్ద 75 నుండి 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. దీంతో గుజరాత్‌లోని తీర ప్రాంతాల్లో నివసించే 38 వేల మందిని ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా NDRF, SDRF బృందాలను తీర ప్రాంతాల్లో సిద్ధంగా ఉంచింది.

తీవ్ర తుఫాన్‌గా మారిన బిపోర్‌జాయ్ కచ్ తీరం వైపు దూసుకొస్తుంది. ఈ నేపధ్యంలో గుజరాత్‌ ప్రభుత్వం సహాయక చర్యలను వేగవంతం చేసింది. తుపాన్‌ను ఎదుర్కొనే సన్నద్దతపై సీఎం భూపేంద్ర పటేల్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం అనుసరించాల్సిన వ్యూహాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇప్పటివరకు 8 జిల్లాల్లో తీర ప్రాంతాల్లో నివసించే దాదాపు 37 వేల7వందల 94 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది.

ముఖ్యంగా సముద్ర తీరానికి 10 కిలోమీటర్ల లోపు నివసించే ప్రజలను ముందుగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తుఫాన్‌ తీవ్రత దృష్యా పలు జిల్లాల్లో ఎన్టీఆర్‌ఫ్‌ 18 బృందాలు, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం 12 బృందాలను సిద్దంగా ఉంచామని గుజరాత్‌ ప్రభుత్వం తెలిపింది. సునిత ప్రాంతాల్లో నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి ...వారికి తగిన ఏర్పాట్లు చేయాలని పలుశాఖలకు ఆదేశించింది. అంతేకాకుండా రోజువారి నిత్యవసరాలను బాధితులకు అందించాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా నిర్వహించిన సమావేశంలో గుజరాత్‌ ప్రభుత్వాన్ని కోరినట్లు అధికారులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories