Akbaruddin Owaisi: ధరణితో వేల కోట్ల నష్టం, రైతుల వేల ఎకరాలు కోల్పోయారు.. BRS పై సంచలన ఆరోపణలు

Akbaruddin Owaisi: ధరణితో వేల కోట్ల నష్టం, రైతుల వేల ఎకరాలు కోల్పోయారు.. BRS పై సంచలన ఆరోపణలు
x
Highlights

Akbaruddin Owaisi comments on BRS party and losses due to Dharani portal: తెలంగాణ అసెంబ్లీ సనావేశాల్లో ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ...

Akbaruddin Owaisi comments on BRS party and losses due to Dharani portal: తెలంగాణ అసెంబ్లీ సనావేశాల్లో ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ ధరణి వల్ల తెలంగాణ రాష్ట్రం కొన్ని వేల కోట్లు నష్టపోయిందన్నారు. రైతులు వేల ఎకరాల భూములు కోల్పోయారని అన్నారు. అసైన్డ్ భూములు పోయాయి. అటవీ శాఖ భూములు గల్లంతయ్యాయి అని అక్బరుద్దీన్ ఆరోపించారు.

ప్రస్తుతం ఈ ప్రభుత్వం ఆ సమస్యలను సవరించే ప్రయత్నం చేస్తోందని ఆయన చెప్పారు. ఈ సవరణల్లో కూడా ఇంకా సవరించాల్సిన అంశాలున్నాయని గుర్తుచేస్తూ వాటిని తాము ఈ సభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. కానీ బీఆర్ఎస్ పార్టీ సభను సజావుగా సాగనివ్వకుండా ఆటంకం కలిగిస్తూ తమకు అడ్డుపడుతోందన్నారు. సభ జరగకుండా అడ్డం పడుతోన్న వారిని అడ్డం రాకుండా రిక్వెస్ట్ అయినా చేయండి.. లేదంటే వారిని సభ నుండి సస్పెండ్ చేయండి అని అక్బరుద్దీన్ ఒవైసి స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను ( TG Speaker Gaddam Prasad ) కోరారు.

అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన విజ్ఞప్తిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ స్పందించారు. బీఆర్ఎస్ సభ్యులు సభకు అడ్డుపడకూడదని ఇప్పటికే తాను ఎన్నోసార్లు వారిని కోరడం జరిగిందన్నారు. అక్బరుద్దీన్ ఓవైసీ ( Akbaruddin Owaisi about BRS in Assembly sessions 2024 ) కూడా అది నిజమేనని, తాము అది కూడా చూస్తున్నామని అన్నారు. మేం ప్రజల కోసం పోరాడుతున్నాం. మీరు ఎవరి కోసం పోరాడుతున్నారు అంటూ బీఆర్ఎస్ సభ్యులను అక్బరుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. సభలో సభ్యులు వ్యవహరించే తీరు ఇదేనా అని బీఆర్ఎస్ సభ్యులను ( Akbaruddin Owaisi's questions to BRS MLAs ) ఆయన నిలదీశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories