Mass Shooting: హైదరాబాద్ చేరుకున్న ఐశ్వర్య మృతదేహం

Aishwarya Dead Body Reached Hyderabad
x

Mass Shooting: హైదరాబాద్ చేరుకున్న ఐశ్వర్య మృతదేహం

Highlights

Mass Shooting: గత శనివారం టెక్సాస్‌లోని ఓ షాపింగ్ కాంప్లెక్స్‌‌లో దుండగుల కాల్పులు

Mass Shooting: అమెరికాలోని టెక్సాస్ కాల్పుల్లో మరణించిన ఐశ్వర్య మృతదేహం ఉదయం ఇంటికి చేరింది. కాసేపట్లో ఐశ్వర్య అంత్యక్రియలు జరగనున్నాయి. రంగారెడ్డి జిల్లా జడ్జి నర్సిరెడ్డి కుమార్తె ఐశ్వర్య అమెరికాలో పని చేస్తున్నారు. ఓ కంపెనీలో ప్రాజెక్టు మేనేజర్‌గా వర్క్ చేస్తున్నారు. మూడు రోజుల క్రితం టెక్సాస్‌లోని ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఐశ్వర్య మృతి చెందింది. శనివారం టెక్సాస్‌లోని ఆలెన్ నగరంలో రద్దీగా ఉన్న ఓ షాపింగ్ మాల్‌లో దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 9 మంది చనిపోయారు. తెలుగు అమ్మాయి ఐశ్వర్య ఉన్నారు. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దుండగుణ్ని కాల్చి చంపేశారు. స్పాట్‌లోనే ఏడుగురు చనిపోయారని... మరో ఇద్దరు ఆసుపత్రిలో చనిపోయినట్టు పోలీసులు ప్రకటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories