Asaduddin Owaisi Welcomes CM KCR Decision: తెలంగాణ సెక్రటేరియట్ పాత భననాల కూల్చివేత సందర్భంగా ఆ ప్రాంగణంలో ఉన్న ఓ ఆలయం, రెండు మసీదులను కూడా నేలమట్టం చేస్తున్న సంగతి తెలిసిందే
Asaduddin Owaisi Welcomes CM KCR Decision: తెలంగాణ సెక్రటేరియట్ పాత భననాల కూల్చివేత సందర్భంగా ఆ ప్రాంగణంలో ఉన్న ఓ ఆలయం, రెండు మసీదులను కూడా నేలమట్టం చేస్తున్న సంగతి తెలిసిందే.. అయితే దీనిపైన ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. ఇప్పుడున్న దానికన్నా ఎక్కువ విస్తీర్ణంలో, విశాలంగా ఎన్నికోట్లయినా వెనుకాడకుండా దేవాలయం, మసీదులను పూర్తి ప్రభుత్వ ఖర్చుతో నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ''తెలంగాణ రాష్ట్రం సెక్యులర్ రాష్ట్రం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ లౌకిక స్ఫూర్తిని కొనసాగిస్తాం. ఇది కాకతాళీయంగా జరిగిన సంఘటన. దీన్ని అందరూ సహృదయంతో అర్థం చేసుకోవాలి'' అని ముఖ్యమంత్రి కోరారు.
అయితే, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనకు ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మద్దతు పలికారు. దీనికి సంబంధించి యునైటెడ్ ముస్లిం ఫోరం తరఫున పూర్తి ప్రకటన విడుదల చేస్తామని శుక్రవారం వరుసగా ట్వీట్లు చేశారు. "సెక్రటేరియట్ భవనాల కూల్చివేత సమయంలో మసీదులు మరియు దేవాలయాలను కూల్చివేసినందుకు ప్రభుత్వ విచారం వ్యక్తం చేస్తూ తెలంగాణ సిఎంఓ విడుదల చేసిన ప్రకటనను నేను స్వాగతిస్తున్నాను." అని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ట్వీట్ చేశారు.
ఇక తెలంగాణ సచివాలయం భవన కూల్చివేత పనులు ప్రారంభించిన ప్రభుత్వం అదే స్థానంలో కొత్త భవనం నిర్మాణం చేపట్టనున్నారు. ఈ క్రమంలోనే నూతన భవన డిజైన్ ను ఇప్పటికే విడుదల చేసింది. కొత్త భవనం నమూనా ఫొటోను ముఖ్యమంత్రి కార్యాలయం తాజాగా విడుదల చేసింది. ఈ భవనం ఆరు అంతస్తుల్లో నిర్మించాలని అధికారులు డిజైన్ చేశారు. త్వరలో డిజైన్‌కు సీఎం కేసీఆర్ కూడా ఆమోద ముద్ర వేయనున్నారు. ఏడాదిలోపే ఈ నిర్మాణం పూర్తి చేయాలని కూడా ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుంది.
Received the following statement regarding the places of worship in the recently demolished Secretariat complex:
— Asaduddin Owaisi (@asadowaisi) July 10, 2020
Chief Minister Sri K Chandrashekhar Rao has expressed his regret & pain over some inconvenience caused to the temple and Mosque in the Secretariat premises due to... pic.twitter.com/KB4hw401Ls
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire