హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వాన

హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వాన
x
Highlights

హైదరాబాద్‌లో నగరంలో మరోసారి వర్షం రావడంతో నగరవాసులు బెంబేలెత్తిపోయారు. తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించడంతో ఇటు జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం అయ్యారు

హైదరాబాద్‌లో నగరంలో మరోసారి వర్షం రావడంతో నగరవాసులు బెంబేలెత్తిపోయారు. తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించడంతో ఇటు జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం అయ్యారు.. నగరంలోని పలు చోట్ల ఇప్పటికే వరద ముంపునకు గురయ్యాయి.

హైదరాబాద్ లో గంటనుంచి అనేక ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతోంది. మొన్నటి అతి భారీ వర్షంనుంచి ఇంకా నగరం కోలుకోనేలేదు. అనేక ప్రాంతాలు ఇంకా నీట మునిగి ఉండగానే మళ్లీ వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు.. జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్, కూకట్ పల్లి, ప్రగతి నగర్, మలక్ పేట ఎల్బీ నగర్, దిల్ షుక్ నగర్, ఫిలింనగర్, హయత్ నగర్, చైతన్యపురి, సరూర్ నగర్ లలో గంట నుంచి విడవకుండా వర్షం తడాఖా చూపిస్తోంది.

అటు ఏపీలోనూ వర్షం దంచి కొడుతోంది. విజయవాడలో గంట నుంచి కుండపోత వాన కురుస్తోంది. ఇంద్రకీలాద్రిపై భారీ వర్షం కారణంగా దుర్గమ్మ దర్శనానికి వచ్చిన భక్తులు నానా అగచాట్లూ పడుతున్నారు. ఆలయ క్యూలైన్లలో టెంట్ల నుంచి ఏకధాటిగా వాన కురుస్తోంది. ఇక ఏలూరు ద్వారకా తిరుమలలోనూ వర్షం దంచికొడుతోంది. భారీ వర్షానికి కొండపై కేశఖండన శాలలోకి నీరు వచ్చి చేరింది.. మొన్నటి వర్షాలకే అల్లాడిపోయిన జనం మళ్లీ వర్షం చూసి గుండెలు బాదుకుంటున్నారు.. వరుణుడు పగబట్టాడా అని వాపోతున్నారు.

ఒకవైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం .. మరోవైపు ఈశాన్య అరేబియా సముద్రంలో అల్పపీడనం వెరసి తెలుగు రాష్ట్రాలను వర్షాలు కుదిపేస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories