మ‌రోసారి హైద‌రాబాద్ న‌గ‌రంలో భారీ వ‌ర్షం

మ‌రోసారి హైద‌రాబాద్ న‌గ‌రంలో భారీ వ‌ర్షం
x
Highlights

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరాన్ని మరోసారి భారీ వర్షం అతలాకుతలం చేసింది. నగర వ్యాప్తంగా మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం భారీ వ‌ర్షం కురిసింది. దీంతో...

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరాన్ని మరోసారి భారీ వర్షం అతలాకుతలం చేసింది. నగర వ్యాప్తంగా మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం భారీ వ‌ర్షం కురిసింది. దీంతో నగరంలోని రోడ్లన్నీ జ‌ల‌మ‌యం అయ్యాయి. దాంతో పాటుగానే ప‌లు కాల‌నీల్లో కూడా వ‌ర‌ద నీరు భారీగా వ‌చ్చి చేరింది. ఈ క్రమంలోనే డీఆర్ఎఫ్ బృందాలు, జీహెచ్ఎంసీ అధికారులు అప్ర‌మ‌త్తం అయ్యాయి. లోత‌ట్టు ప్రాంతాల‌తో పాటు శిథిలావ‌స్థ భ‌వ‌నాల్లో ఉన్న ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించాల‌ని జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ లోకేశ్ కుమార్ అధికారుల‌ను ఆదేశించారు. అత్య‌వ‌స‌ర సేవ‌ల కోసం 100కు డ‌య‌ల్ చేయాల‌ని సూచించారు. న‌గ‌ర ప్ర‌జ‌లు ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రావొద్ద‌ని అధికారులు హెచ్చ‌రించారు.

మూసీ న‌ది ప‌రివాహ‌క ప్రాంతాల్లోని ప్ర‌జ‌ల‌ను బ‌య‌ట‌కు రానివ్వ‌కుండా అధికారులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. లోయ‌ర్ ట్యాంక్ బండ్ ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేశారు. హుస్సేన్ సాగ‌ర్ నిండు కుండలా మార‌డంతో దిగువ‌కు నీటిని విడుద‌ల చేస్తున్నారు. భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో జిల్లాల్లో రిజ‌ర్వాయ‌ర్ల వ‌ద్ద ఉన్న‌ ప‌ర్యాట‌క శాఖ బోట్ల‌ను హైద‌రాబాద్‌కు ప్ర‌భుత్వం తెప్పించింది. మొత్తం 53 బోట్ల‌ను హైద‌రాబాద్‌కు తెప్పించింది. వ‌ర్షాభావ ప్రాంతాల్లో బోట్ల‌ను ప్ర‌భుత్వం అందుబాటులో ఉంచ‌నుంది. బాధితుల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించేందుకు బోట్ల‌ను ప్ర‌భుత్వం సిద్ధం చేసింది. రాష్ర్ట ప్ర‌భుత్వం విజ్ఞ‌ప్తి మేర‌కు 5 బోట్ల‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం పంపింది.

ఇక పోతే హైదరాబాద్ నగరంలో బ‌హ‌దూర్‌పురా, మెహిదీప‌ట్నం, టోలిచౌకి, గచ్చిబౌలి, మ‌దాపూర్‌, కొండాపూర్‌, హైటెక్‌సిటీ, జూబ్లీహిల్స్‌, ఆర్‌కే పురం, సైదాబాద్‌, దిల్‌సుఖ్ న‌గ‌ర్‌, చైతన్య‌పురి, స‌రూర్‌న‌గ‌ర్‌, కొత్త‌పేట‌, సంతోష్ న‌గ‌ర్‌, చార్మినార్‌, ఫ‌ల‌క్‌నూమా, జూపార్క్, అఫ్జ‌ల్‌గంజ్‌, ఉప్ప‌ల్‌, కుషాయిగూడ‌, నాగారం, ద‌మ్మ‌యిగూడ‌, చ‌ర్ల‌ప‌ల్లి, న‌ల్ల‌కుంట‌, అంబ‌ర్‌పేట‌, ముషీరాబాద్‌, నారాయ‌ణ‌గూడ‌, బంజారాహిల్స్‌, ఖైర‌తాబాద్‌, పంజాగుట్ట‌, బేగంపేట‌, సికింద్రాబాద్‌, కూక‌ట్‌ప‌ల్లి, బాలాన‌గ‌ర్‌, బోయిన్‌ప‌ల్లి, అల్వాల్‌, తార్నాక‌, హ‌బ్సిగూడ‌, కోఠి, ల‌క్డీకాపూల్‌తో పాటు పలు ప్రాంతాల్లో వ‌ర్షం కురిసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories