Corona Fear: జనాల్లో మరోసారి కరోనా భయం

Again Corona Fear in Public
x

కరోనా (ఫైల్ ఫోటో)

Highlights

Corona Fear: జనాన్ని లూటీ చేస్తున్న ప్రైవేట్ హాస్పిటల్స్ * సెకండ్ వేవ్‌తో భారీగా పెరుగుతున్న బాధితుల సంఖ్య

Corona Fear: ఒకవైపు కరోనా సెకండ్ వేవ్ దడ పుట్టిస్తుంటే.. ఇదే అదునుగా కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ బాధితులను నిలువు దొపిడి చేస్తున్నాయి. సెకండ్ వేవ్‌ బారిన పడిన వాళ్లు ఎక్కువగా ఉండడంతో.. ప్రైవేట్ హాస్పిటల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా ప్రైవేట్ యాజమాన్యం బాధితులను లూటీ చేస్తున్నారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన జీవోని పట్టించుకోవడం లేదని జనాలు మండిపడుతున్నారు..

గతేడాది మార్చ్‌లో మొదటి కరోనా కేసు మొదలైనప్పటి నుంచి.. ఏప్రిల్ వరకు చాలా కేసులు ఒక్కసారిగా పెరిగాయి. దాంతో కరోనా బాధితులు పెరగడంతో బెడ్స్ ఫుల్ అవ్వడంతో మే ప్రైవేట్ హాస్పిటల్స్ లో కరోనా ట్రీట్మెంట్‌కి అనుమతి ఇచ్చింది. అప్పటి నుంచి పేదాలను ప్రైవేట్ యాజమాన్యం లూటీ చేస్తుంది.

వార్డుల వారీగా ఒక రేటు ఫిక్స్ చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. కానీ, ఇవేమీ పట్టించుకోకుండా ప్రైవేట్ హాస్పిటల్స్ లక్షల్లో బిల్స్ వేస్తున్నాయి. బాధితులు ఫిర్యాదు చేసిన ప్రభుత్వం వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో హైకోర్ట్ సీరియస్ అయింది. దాంతో ఎట్టకేలకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

కరోనా సెకండ్ వేవ్‌తో ప్రైవేట్ హాస్పిటల్స్ లో చేరుతుండడంతో అందకు వారి రోజుకి 50వేల నుంచి రెండు లక్షల దాకా బిల్లు వేస్తున్నారు. 10 రోజులు ఉంటే 10లక్షలు బిల్లు వేస్తున్నారు. బిల్లు పెరగడంతో బాధితులు లబోదిబోమంటున్నారు.

బాధితులను దోచుకోవడమే కాకుండా.. మరణాలని సర్కార్ దవాఖానాలపై వేస్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్, ఐసీయూ, వెంటిటేటర్స్‌పై పది, పదిహేను రోజులు ఉంచుకుని అందినంత దోచుకున్నాక బతికే అవకాశం లేనప్పుడు ప్రభుత్వ హాస్పిటల్స్ కి పంపిస్తున్నారు. ఆ నిందను ప్రభుత్వ ఆస్పత్రులపై వేస్తున్నారు.

ఆరోగ్యశాఖ మంత్రి దగ్గర నుంచి అధికారుల వరకు గత ఏడాది జూన్‌లో తీసుకొచ్చిన జీవో గురించి నోరు మెదపడం లేదు.. సామాన్యులకి కరోనా పేరుతో దోచుకునే ప్రైవేట్ హాస్పిటల్స్‌ని పట్టించుకోకపోతే మళ్లీ బాధితులు అప్పుల్లో కురుకుపోతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories