Actress Maadhavi Latha: సీఎం రేవంత్‌ రెడ్డికి నటి మాధవీలత ప్రశ్నల వర్షం..!

Actress Maadhavi Latha Comments On CM Revanth Reddy Over Sandhya Theatre Stampede
x

Actress Maadhavi Latha: సీఎం రేవంత్‌ రెడ్డికి నటి మాధవీలత ప్రశ్నల వర్షం..!

Highlights

Maadhavi Latha Comments: సంధ్య థియేటర్ వ్యవహారంపై నటి మాధవీలత సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అవుతూ ఓ వీడియో రిలీజ్ చేశారు

Maadhavi Latha Comments: సంధ్య థియేటర్ వ్యవహారంపై నటి మాధవీలత సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అవుతూ ఓ వీడియో రిలీజ్ చేశారు. అందులో రేవంత్ రెడ్డికి ఆమె కొన్ని ప్రశ్నలు అడిగారు. అల్లు అర్జున్ చేసింది క్రైమ్ కాదని.. ఆయనకి తెలియకుండా జరిగిందని తెలిపారు. అయితే ఆ ఘటన మీద సరిగా స్పందించకపోవడం అల్లు అర్జున్ చేసిన పొరపాటు అని చెప్పారు. తప్పుకు, నేరానికి, పొరపాటుకు చాలా తేడా ఉందని ఆమె అన్నారు.

అలా అనుకుంటే రీసెంట్‌గా మెదక్ జిల్లాలో ఒక చిన్న పాపను రేప్ చేశారు. దాని గురించి మాట్లాడి అక్బరుద్దీన్, అసదుద్దీన్ ఓవైసీలను నిలదీస్తారా..? అని ప్రశ్నించారు. అంతేకాకుండా కొడంగల్‌లో ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటున్నా అని లెటర్ రాసి చనిపోతే వారి కుటుంబ సభ్యులకు రూ.25 లక్షలు కాకపోయినా.. 25 వేలు అయినా ఇచ్చారా..? అని నిలదీసింది. పొద్దు తిరుగుడు పువ్వు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆ రైతు కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సాయం చేశారా..? అని ప్రశ్నించారు.

జరిగిన తప్పుకి ఇండస్ట్రీ మీద ఉక్కుపాదం మోపాలి, వాళ్లని కాళ్ల కింద పెట్టుకోవాలని రేవంత్ రెడ్డి చూస్తున్నారని ఫైర్ అయ్యారు మాధవీలత. జగన్ సీఎం అయ్యాక సినిమా వాళ్లందరినీ పిలిపించుకుని ఫోజులు కొట్టి దండం పెట్టించుకున్నట్లు.. సీఎం రేవంత్ రెడ్డి తాను ఎందుకు చేయకూడదని అనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎంతో కష్టపడి రేవంత్ రెడ్డి ఈ స్థాయికి వచ్చారని అంటూనే ఎందుకు ఇలా దిగజారి ప్రవర్తిస్తున్నారని ఆమె ప్రశ్నించారు. గురుకుల పాఠశాలల్లో ఎంతోమంది చనిపోతే ఏనాడైనా మాట్లాడిన పాపాన పోలేదన్నారు. అందరికీ ఒకేలాగా స్పందించాలని కోరారు. ఇప్పుడు దిల్ రాజును అడ్డం పెట్టుకుని పెత్తనం చెలాయించాలని చూస్తున్నారని ఆమె ఆరోపించారు. మాధవీలత చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. దీనిపై ఇటు కాంగ్రెస్ నేతలు.. అటు సినీ ఇండస్ట్రీ ఎలా స్పందిస్తుందో చూడాలి.


Show Full Article
Print Article
Next Story
More Stories