చట్టాలు లేక్కచేయని అక్రమార్కులు.. గిరిజన భూముల ఆక్రమణ

చట్టాలు లేక్కచేయని అక్రమార్కులు.. గిరిజన భూముల ఆక్రమణ
x
Highlights

పేసా చట్టాన్ని పాతరేశారు. ఆదివాసీలకు భూములపై హక్కులనిచ్చే చట్టాలను భూస్థాపితం చేశారు. వేల ఏకరాల అమాయికుల భూములను దోపిడీ చేసి అక్రమణ జెండాలను...

పేసా చట్టాన్ని పాతరేశారు. ఆదివాసీలకు భూములపై హక్కులనిచ్చే చట్టాలను భూస్థాపితం చేశారు. వేల ఏకరాల అమాయికుల భూములను దోపిడీ చేసి అక్రమణ జెండాలను పాతేస్తున్నారు. అదివాసీల భూములను, అస్తులను మింగేస్తున్నా రాబందులేవరు..? ఉమ్మడి ఆదిలాబాద్ ఎజన్సీలో అక్రమార్కుల దోపిడీపై హెచ్ఎంటీవీ స్పేషల్ రిపోర్ట్.

ఉమ్మడి ఆదిలాబాద్ ఎజన్సీలో అక్రమార్కుల దోపిడికి అడ్డుఅదుపు లేకుండా పోతుంది. ఎజన్సీ ప్రాంతంలో గిరిజనుల ఆస్తులను భూములను పరిరక్షించడానికి ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. కాని ఆ చట్టాలను ఉల్లంఘిస్తూ కొందరు బరితెగించి గిరిజనుల భూములను కాజేస్తున్నారు. ప్రధానంగా గిరిజనుల హక్కులను రక్షించడానికి ఎజన్సీ ప్రాంతంలో వన్ సెవెంటీ (1/70) యాక్ట్, పీసా యాక్ట్ లు ఉన్నాయి. 1/70 యాక్ట్ ప్రకారం ఎజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరులు భూములు కోనుగోలు చేయరాదు. ‌కొనుగోలు చేసినా ఆ భూములపై హక్కులు లభించవు. అదేవిధంగా గిరిజన ప్రాంతాలలో ఏ పని చేయాలన్నా గిరిజన గ్రామాల తీర్మానం తప్పనిసరి. గిరిజనుల గ్రామసభ తీర్మానాలు లేకుండా ఏలాంటి పనులు చేపట్టరాదని చట్టాలు చెబుతున్నాయి.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎజన్సీ ప్రాంతంలో 1/70 యాక్టు ఉల్లంఘనలు జరుగుతున్నాయి. గిరిజన భూములను కొందరు అక్రమార్కులు అడ్టగోలుగా రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. జైనూర్ మండలంలో ఓ భూబకాసురుడు ఏకంగా ఆరువందల ఏకరాలను కబ్జా చేసి పట్టాలు చేయించుకోవడం విశేషం. ఈ భూముల విలువ కనీసం వంద కోట్లకు పైగా ఉంటుంది‌. కెరమెరి, ఉట్నూరు, ఇంద్రవెల్లి, నార్నూర్‌, తిర్యాణి ప్రాంతాల్లో మొత్తం యాబై వేల ఎకరాల భూములను అక్రమార్కులు తమ నుంచి అక్రమించుకున్నారని గిరిజనులు అరోపిస్తున్నారు. ఎజన్సీ ప్రాంతంలో ఈ ఐదు సంవత్సరాల కాలంలో వందల కోట్లు విలువ చేసే భూములు భూకబ్జాదారుల పాలవుతున్నాయి.

అయితే భూములు కబ్జాలు కావడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో ప్రధానం గిరిజనుల అమాయకత్వం. వారి అమాయకత్వాన్ని అసరాగా చేసుకొని పెళ్లికి, పంటకు అప్పులు ఇచ్చి ఆ అప్పుల కోసం భూములను లాక్కుకుంటున్నారు. మరికొందరు భూస్వాములు బరితెగించి గిరిజనుల భూములపై జెండాలు పాతేస్తున్నారు. పైగా అక్రమించిన భూములకు నిబంధనలు అడ్డు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. 1/70 యాక్ట్ 1970లో వస్తే ఆ చట్టం రాకముందు భూములు కొనుగోలు చేసినట్లుగా తప్పుడు రికార్డులు సృష్టించి కబ్జాలకు పాల్పడుతున్నారు. ఎవరైనా అక్రమార్కులను ప్రశ్నిస్తే వారిపై పోలీసు కేసులు నమోదు చేస్తున్నారు. దాంతో తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకోవడానికి గిరిజనులు భయపడుతున్నారు.

అయితే పంటపోలాలను మింగిన రాకాసులు నివాస స్థలాల జోలికి పోవడం లేదు. ఉట్నూరు, ఇచ్చోడ, ఇంద్రవెల్లి, అసిపాబాద్, కెరమెరి ప్రాంతాలలో నిబంధనలకు వ్యతిరేకంగా రియల్ ఎస్టేట్ వేంచర్లు వేసి అమ్మకాలు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో గిరిజనేతరులు నివాస స్థలాలు కొనుగోలు చేయడం చట్ట విరుద్ధం. కానీ ఇక్కడ భారీ వాణిజ్య సముదాయాలు సైతం ‌నిర్మిస్తున్నారు‌. బహుళ అంతస్తుల భవనాలు నిర్మించడం నిబంధనలకు వ్యతిరేకం. కాని ఏకంగా ఐదంతస్తుల భారీ భవనాలు నిర్మిస్తున్నారు. కొందరు వడ్డీ వ్యాపారులు అసిపాబాద్ జిల్లా కేంద్రంలో వందల భవనాలు అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారు. అయినప్పటికీ అదికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఎజన్సీ ప్రాంతంలో గిరిజన హక్కులను దోపిడీదార్లు కాలరాస్తున్నాయి. ఈ దోపిడీ దారుల వల్ల భూముల ధరలు అమాంతంగా పెరిగిపోతున్నాయి. దీనికి కారణమైన దోపిడిదారులపై చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories