ACB Raids: అల్వాల్ విద్యుత్ అధికారి ఇళ్లు, ఆఫీస్‌లో ఏసీబీ సోదాలు

ACB Raids Alwal Electricity Officers house and office
x

ACB Raids: అల్వాల్ విద్యుత్ అధికారి ఇళ్లు, ఆఫీస్‌లో ఏసీబీ సోదాలు

Highlights

ACB Raids: ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని తనిఖీలు

ACB Raids: అల్వాల్‌లో విద్యుత్‌శాఖ అధికారి అనిల్ కుమార్‌రెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ ఆనంద్ నేతృత్వంలో అనిల్ కుమార్ నివాసంలో ఉదయం నుండి సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనిల్ ఇంట్లో 34 లక్షల రూపాయలను గుర్తించిన ఏసీబీ అధికారులు... 20 తులాల బంగారంతో పాటు... కోటి రూపాయల ఆస్తులను గుర్తించారు. 2023 ఫిబ్రవరిలో కీసరలో పని చేస్తున్న సమయంలో ఏసీబీ అధికారులకు పట్టుబడినట్లు తెలిపారు.

ఏసీబీకి పట్టుబడిన అనంతరం జరిగిన విచారణలో ఆయన ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న సమాచారంతో ఇంట్లో సోదాలు నిర్వహించినట్లు తెలిపారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఆ విషయమై వారి బంధువుల ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories