Shiva Balakrishna: HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో వేగం పెంచిన ఏసీబీ

ACB increased speed in former HMDA director Shiva Balakrishna case
x

Shiva Balakrishna: HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో వేగం పెంచిన ఏసీబీ

Highlights

Shiva Balakrishna: అక్రమ ఆస్తుల వివరాలను ల్యాప్‌టాప్‌, హార్డ్‌డిస్కుల్లో స్టోర్ చేసినట్లు గుర్తింపు

Shiva Balakrishna: అక్రమాస్తుల కేసులో అరెస్టయిన HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ దర్యాప్తులో ఏసీబీ వేగం పెంచింది. ఈ కేసు దర్యాప్తు ప్రైమరీ రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించారు ఏసీబీ అధికారులు. కస్టడీ విచారణలో శివబాలకృష్ణ చెప్పిన వివరాలతో పాటు ఐఏఎస్ అరవింద్ కుమార్ పాత్రపై రిపోర్టును రెడీ చేశారు ఏసీబీ అధికారులు. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌ను విచారించేందుకు ప్రభుత్వ అనుమతి కోరింది ఏసీబీ. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే ఐఏఎస్ అధికారి అరవింద్‌కుమార్‌ను విచారించనున్నారు ఏసీబీ అధికారులు.

మరో వైపు శివబాలకృష్ణ ఎనిమిదేళ్లలో 10 సెల్‌ఫోన్లు, 9 ల్యాప్‌టాప్‌లు వాడినట్లు గుర్తించారు ఏసీబీ అధికారులు. శివబాలకృష్ణ అక్రమంగా సంపాదించిన ఆస్తుల వివరాలను ల్యాప్‌టాప్, హార్డ్‌డిస్కుల్లో పొందుపరిచినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. భారీగా లావాదేవీలు జరిపిన ప్రతీసారి శివబాలకృష్ణ సెల్‌ఫోన్స్ మార్చినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

ఇక ఏసీబీ సోదాల సమయంలో బాలకృష్ణతో పాటు ఆయన కుటుంబసభ్యులకు సంబంధించిన 31 ఎలక్ట్రానిక్ డివైస్‌లు, సెల్‌ఫోన్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఫోరెన్సిక్ నిపుణుల సహాయంతో వాటిలోని డేటాను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు ఏసీబీ అధికారులు.

Show Full Article
Print Article
Next Story
More Stories